Admissions : ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సులకు అడ్మిషన్లు

తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల‌లో ప్రవేశాల కోసం జూన్ 10 నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Admissions : ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సులకు అడ్మిషన్లు

Sv Music Dance College

Admissions : తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల‌లో ప్రవేశాల కోసం జూన్ 10 నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

సాయంత్రం గం.5.30 నుండి గం.6.30 వరకు ఒక గంట పార్ట్‌టైమ్, సర్టిఫికేట్, డిప్లొమా, కళాప్రవేశిక కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.  వీటిలో గాత్రం, వీణ, వయొలిన్, వేణువు, మృదంగం , భరతనాట్యం, కూచిపూడి నృత్యం విభాగాల్లో ప్ర‌వేశాలు  జరుగుతున్నాయి.

ఈ క‌ళాశాల‌లో హైద‌రాబాదులోని పొట్టి శ్రీ‌రాములు తెలుగు యూనివ‌ర్సిటీ గుర్తింపు పొందిన స‌ర్టిఫికెట్ కోర్సు (4 ఏళ్లు), డిప్లొమా కోర్సు(2 ఏళ్లు) ఉన్నాయి. టీటీడీ నిర్వహించే క‌ళాప్ర‌వేశిక‌ (రెండేళ్ల ఫౌండేష‌న్ కోర్సు) అప్లికేషన్ రూ.50 చెల్లించి కార్యాలయ పని వేళల్లో పొందవచ్చునని చెప్పారు.

పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను జూన్ 10 నుండి అన్ని జిరాక్స్ కాపీలతో కలిపి జూన్ నెలాఖరు లోపు సమర్పించాలని ఆయన తెలిపారు. ఇత‌ర వివ‌రాల‌కు 0877-2264597 / 7330811173 / 9391599995 ఫోన్ ద్వారా లేదా టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Also Read : Char Dham Yatra: ఒక్క నెలలో 14 లక్షల మంది దర్శనం: చార్ ధామ్ యాత్రలో రికార్డు స్థాయిలో భక్తులు