Vishal : చంద్రబాబు‌పై పోటీ గురించి స్పందించిన హీరో విశాల్

ప్రముఖ తమిళ హీరో విశాల్... తాను కుప్పం నియోజక వర్గం నుంచి చంద్రబాబుపై పోటీ చేస్తానంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Vishal : చంద్రబాబు‌పై పోటీ గురించి స్పందించిన హీరో విశాల్

Vishal Kuppam

Vishal :  ప్రముఖ తమిళ హీరో విశాల్… తాను కుప్పం నియోజక వర్గం నుంచి చంద్రబాబుపై పోటీ చేస్తానంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వస్తున్నానని.. కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాననే ప్రచారం జరుగుతోంది వాటన్నింటినీ ఖండిస్తున్నాను.

రాజకీయాలకు సంబంధించి తాను ఇప్పటివరకూ ఎవరిని కలవలేదని … ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియటం లేదని అన్నారు. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని, చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం నాకు లేదు అని ….ట్విట్టర్ లో పేర్కోన్నారు.