Buddha Venkanna: క్యాసినో ఆడించి అమాయకుల నుంచి రూ. 200కోట్లు దోచుకున్నావు – బుద్దా వెంకన్న

తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కారును ధ్వంసం చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ నాయకులు బుద్దా వెంకన్న.

Buddha Venkanna: క్యాసినో ఆడించి అమాయకుల నుంచి రూ. 200కోట్లు దోచుకున్నావు – బుద్దా వెంకన్న

Budda Venkanna

Buddha Venkanna: తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కారును ధ్వంసం చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ నాయకులు బుద్దా వెంకన్న. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని, కొడాలి నాని లాంటి వ్యక్తులతో చంద్రబాబుని తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దా వెంకన్న. గన్‌మెన్లను అడ్డం పెట్టుకుని అవాకులు చవాకులు పేలుతున్నారని, జగన్ కూడా గమ్ మెన్లను పెంచి మరీ వారి బూతులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడం మాత్రమే పనిగా పెట్టుకుని, ఏదో పెద్ద పోటుగాడిలా నాని ఫీలవుతున్నాడని అన్నారు. అధికారంలో లేనప్పుడు అసలు నాని ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు. ఎన్టీఆర్‌‌తో కలిసి పనిచేసినట్లు ఫోజులు కొడుతున్నావు.. ఒక్క ఫొటో అయినా చూపించగలవా? అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. చంద్రబాబు రాజకీయ బిక్ష పెడితే ఎమెల్యే అయినోడివి.. ఇప్పుడు జగన్ తానా అంటే తందానా అంటూ నోరు పారేసుకుంటున్నావు అని నానిపై మండిపడ్డారు.

Jowar Roti : అధిక కొవ్వులను తగ్గించే జొన్నరొట్టె

కొడాలి నాని నువ్వు క్యాసినో ఆడించింది వాస్తవం కాదా? అమాయక ప్రజల నుంచి 200కోట్లు దోచుకున్నావు. మీ తప్పులను ప్రశ్నిస్తే, మా వాళ్ల కారులను ధ్వంసం‌ చేయిస్తావా? టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యలు వెళ్తే దాడులు చేస్తారా? వైసీపీ రౌడీ మూకలు రోడ్లపైకి వస్తే పోలీసులు ఏం‌ చేస్తున్నారు? వాస్తవాలు వివరించేందుకు వెళ్లిన టిడిపి నేతలను మాత్రమే అరెస్టు చేస్తారా? క్యాసినో ఆడిన వారిపైన మాత్రం కేసులు ఉండవా? అని ప్రశ్నించారు.

కొడాలి నాని.. నీకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చంద్రబాబుపై నోరు పారేసుకుంటే ఇక సహించం.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశ్వరూపం చూపిస్తారు. ఇక మాకు కూడా ఓర్పు, సహనం నశించిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కాదు.. మీ ప్రభుత్వం హయాంలోనే నాని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.