CID Investigation : బాబు పేరు చెప్పాలంట..లోకేష్ ను తీసుకొస్తారంట – దేవినేని ఉమ

టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెప్పాలంట..ఆయనే చేయిపించారంట...బాబు పేరు చెబితే..లంచ్ టైంకు వెళ్లిపోవచ్చు..టీడీపీ పార్టీ చేసింది..బాబు చేశారని చెబుతారా ? లేదా ? అని ప్రశ్నించారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని మీడియాకు తెలిపారు.

CID Investigation : బాబు పేరు చెప్పాలంట..లోకేష్ ను తీసుకొస్తారంట – దేవినేని ఉమ

Devineni

TDP leader Devineni Uma : టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెప్పాలంట..ఆయనే చేయిపించారంట…బాబు పేరు చెబితే..లంచ్ టైంకు వెళ్లిపోవచ్చు..టీడీపీ పార్టీ చేసింది..బాబు చేశారని చెబుతారా ? లేదా ? అని ప్రశ్నించారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని మీడియాకు తెలిపారు. మార్ఫింగ్ వీడియోపై సీఐడీ అధికారలు ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగా..ఉమ మొదటి రోజు సీఐడీ విచారణ ముగిసింది. 2021, ఏప్రిల్ 29వ తేదీ గురువారం మొత్తం 9 గంటల పాటు ప్రశ్నించారు సీఐడీ అధికారులు. అనంతరం ఉమ మీడియాతో మాట్లాడుతూ..బాబు పేరు చెప్పాలంట..ఏంటీ జగన్నాటకాలు..ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ స్పైడర్ సినిమా చూడాలని సూచిస్తున్నట్లు ఉమ వెల్లడించారు.

ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ..విమర్శలు గుప్పించారు. 9 గంటల సీబీసీఐడీ కార్యాలయంలో కూర్చొబెడితే..మీ పైశాచిక ఆనందం తీరుతుందా అని ప్రశ్నించారాయన. బండరు సత్యనారాయణ రెడ్డి, అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ లను తీసుకొస్తారంట…లోకేష్ బాబును తీసుకొస్తారంట ..తీసుకరండి అంటూ ఉమ ఫైర్ అయ్యారు.

Read More : May 2021 : మే నెలలో బ్యాంకులకు సెలవులు..ఎప్పుడెప్పుడంటే