Amazon Prime Membership Plans : జూలై 15 నుంచే ప్రైమ్ డే సేల్.. 50 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్లు.. డోంట్ మిస్..!

Amazon Prime membership plans : అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ 50 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. జూలై 15న ప్రారంభమయ్యే ప్రైమ్ డే సేల్ ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందు తక్కువ ధరకు ఈ ప్లాన్లను పొందవచ్చు.

Amazon Prime Membership Plans : జూలై 15 నుంచే ప్రైమ్ డే సేల్.. 50 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్లు.. డోంట్ మిస్..!

Amazon Prime membership plans available with 50 percent cashback offer

Amazon Prime membership plans : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్రైమ్ సభ్యత్వం 50 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. వినియోగదారులు చాలా తక్కువ ధరకు ఈ ప్రైమ్ ప్లాన్లను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈవెంట్‌కు ముందు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. జూలై 15న ప్రారంభమై జూలై 16 చివరి వరకు ప్రైమ్ డే సేల్ కొనసాగుతుంది. ఆసక్తి గల వినియోగదారులు కొన్ని వారాల పాటు ఉచితంగా సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు. పూర్తి వివరాల కోసం ఓసారి లుక్కేయండి..

అమెజాన్‌లో 50 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ :
అమెజాన్ ప్రైమ్ నెలవారీ ప్లాన్ రూ.299 కింద రూ.150 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో లభిస్తుంది. రూ.1,499 వార్షిక సబ్‌స్క్రిప్షన్ కింద రూ.750 క్యాష్‌బ్యాక్‌తో అందిస్తుంది. ప్రాథమికంగా నెలవారీ ప్లాన్ రూ. 149 కు పొందవచ్చు. అయితే, వార్షిక ప్యాక్ ధర రూ. 749కి తగ్గుతుంది.

Read Also : Apple AirPods Series : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఎయిర్‌ప్రాడ్ హెడ్‌ఫోన్‌లపై అదిరే డిస్కౌంట్లు.. రూ. 19,901 ధరకే సొంతం చేసుకోవచ్చు!

ఈ ఆఫర్‌ పొందాలంటే.. 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వారికి మాత్రమే ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఆఫర్‌ వర్తిస్తుంది. అమెజాన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు మీరు అర్హులు కావాలంటే వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అదనంగా, క్యాష్‌బ్యాక్ అమెజాన్ పే బ్యాలెన్స్‌గా తిరిగి వస్తుందని గుర్తుంచుకోండి.

Amazon Prime membership plans available with 50 percent cashback offer

Amazon Prime membership plans available with 50 percent cashback offer

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ ఇవే :
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా వేగవంతమైన డెలివరీలను పొందవచ్చు. వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో సినిమాలు, టీవీ షోలు, ఇతర కంటెంట్‌లను కూడా వీక్షించవచ్చు. ప్రైమ్ రీడింగ్ కేటలాగ్ నుంచి ఈబుక్స్, కామిక్స్ వంటి మరిన్నింటిని కూడా తీసుకోవచ్చు. మీరు (Amazon Music) యాప్‌ను ఉచితంగా కూడా ఉపయోగించవచ్చు. అమెజాన్ బెనిఫిట్స్ ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్లే లిస్టు, స్టేషన్‌లు, మిలియన్ల కొద్దీ పాటలు, ఆల్బమ్‌లకు అన్‌లిమిటెడ్, యాడ్-ఫ్రీ యాక్సస్ కలిగి ఉంటాయి. అమెజాన్‌లో అద్భుతమైన డీల్స్, కొన్ని ప్రత్యేకమైన ఆఫర్‌లకు ముందస్తు యాక్సెస్‌ పొందవచ్చు. మీరు అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్స్ సమయంలో అందుబాటులో ఉండే డీల్‌లకు కూడా యాక్సెస్ పొందవచ్చు.

ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఫ్రీగా పొందడం ఎలా? :
అమెజాన్, ప్రస్తుతం కొత్త యూజర్లకు ఒక నెల ఫ్రీ ట్రయల్‌ని అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను పొందకుంటే.. వెబ్‌సైట్‌కి వెళ్లి అమెజాన్ ప్రైమ్ వీడియోను అధికారికంగా ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ అమెజాన్‌లో ఇంకా అకౌంట్ క్రియేట్ చేయని వారికి మాత్రమే. ఒక నెల ఫ్రీ ట్రయల్‌ను పొందేందుకు మరో అకౌంట్లో (Amazon Prime Video) లాగిన్ చేయండి.

Read Also : iQOO Neo 7 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ నియో 7 ప్రో వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!