Apple iPhone 14 Price : అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇదే సరైన సమయం.. వెంటనే కొనేసుకోండి..!

Apple iPhone 14 Price : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900 వద్ద అందుబాటులో ఉంది. అమెజాన్ ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకే విక్రయిస్తోంది. పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

Apple iPhone 14 Price : అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇదే సరైన సమయం.. వెంటనే కొనేసుకోండి..!

Apple iPhone 14 is selling at lowest ever price, should you buy or wait for iPhone 15

Apple iPhone 14 Price : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. గత ఏడాదిలో లాంచ్ అయిన ఐఫోన్ 14 సిరీస్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. వాస్తవానికి, ఐఫోన్ 14 లాంచ్ అయిన తర్వాత అత్యంత తక్కువ ధరకు రావడం ఇదే తొలిసారి. అమెజాన్ ప్రస్తుతం 128GB స్టోరేజీ iPhone 14 బేస్ మోడల్‌ను రూ. 68,000 లోపు విక్రయిస్తోంది. ఆపిల్ ఐఫోన్ లిస్టింగ్ ధర రూ.67,664గా ఉంది. అసలు రిటైల్ ధరపై ఐఫోన్ 14 కొనుగోలుపై దాదాపు రూ. 12,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Apple Sale Days on Amazon : అమెజాన్‌లో ఆపిల్ సేల్ డేస్.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 సిరీస్‌ ధర.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి..!

భారత్‌లో ఐఫోన్ 14 ధర తగ్గింపు :
వాస్తవానికి భారత మార్కెట్లో ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900 వద్ద అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు. రూ.68వేల లోపు డీల్ అందుబాటులో ఉంది. కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? ఇప్పుడే ఐఫోన్ 14ని పొందవచ్చు. మీరు మరో రెండు నెలలు ఎదురుచూస్తే.. ఐఫోన్ 15 లాంచ్ తర్వాత ఆపిల్ ఐఫోన్ 14 ధరను మరింత తగ్గించే అవకాశం ఉంది. ఐఫోన్ 15 త్వరలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకూ ఐఫోన్ 15 నిర్దిష్ట లాంచ్ డేట్ ఆపిల్ వెల్లడించలేదు. ఐఫోన్ 15 సిరీస్ ప్రతి ఏడాదిలానే సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Apple iPhone 14 is selling at lowest ever price, should you buy or wait for iPhone 15

Apple iPhone 14 is selling at lowest ever price, should you buy or wait for iPhone 15

ఐఫోన్ 14 లేదా ఐఫోన 15.. ఏది బెటర్? :
ఆపిల్ ఐఫోన్ 15 గురించి ఎలాంటి వివరాలను ధృవీకరించలేదు. డిజైన్ గురించి మాత్రమే కాదు.. స్పెసిఫికేషన్‌లు, ధర గురించి కూడా వివరాలను వెల్లడించాయి. నివేదికల ప్రకారం… ఐఫోన్ 15 ధర రూ. 79,900 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 14తో పోలిస్తే.. ధర ఎక్కువగా ఉండొచ్చు. మీకు బడ్జెట్ లిమిట్ ఉంటే.. ఐఫోన్ 14 కొనుగోలు చేయొచ్చు.

మెరుగైన కెమెరాలు, ఆప్టిమైజ్ బ్యాటరీ, సున్నితమైన యూజర్ ఇంటర్‌ఫేస్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ 15 బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ 15 అనేది ఐఫోన్ 14 మెరుగైన వెర్షన్. ఇందులో కెమెరాలు, మెరుగైన పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉండనుంది. ఐఫోన్ 14 కూడా పర్ఫార్మెన్స్, బెస్ట్ కెమెరాలతో అద్భుతమైన డీల్ అని చెప్పవచ్చు. ఐఫోన్ 15 కొనాలని అనుకుంటే అప్పటివరకూ ఆగాల్సిందే..

Read Also : Samsung Galaxy S23 Ultra : శాంసంగ్ కొత్త బిగ్ టీవీ సేల్.. ఉచితంగా గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్, స్మార్ట్‌టీవీలపై రూ. 20వేల వరకు క్యాష్‌బ్యాక్..!