Best Smartphones in June 2023 : రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Best Smartphones in June 2023 : ఈ జూన్‌లో భారత మార్కెట్లో రూ. 40వేల ధర లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో OnePlus 11R 5G సహా మరో 3 ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Best Smartphones in June 2023 : రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Best Smartphones to buy in India under Rs 40,000 in June 2023

Best Smartphones in June 2023 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రీమియం యూజర్లకు సరసమైన టాప్ స్మార్ట్‌ఫోన్ల కోసం వెతుకుతున్నారా? భారత మార్కెట్లో రూ. 40వేల కన్నాతక్కువ ధరకు అనేక అద్భుతమైన ఆప్షన్లతో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. హై-క్వాలిటీ కెమెరాలు, లాంగ్ లైఫ్ బ్యాటరీలు, ప్రాసెసింగ్ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ జాబితాలో (OnePlus 11R) ఫోన్ కూడా ఉంది. అయితే, ఈ జూన్‌లో భారత్‌లో కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు అన్నింటి ధర రూ. 40వేల కన్నా తక్కువగా ఉంటుంది. అవేంటో ఓసారి చూద్దాం..

1. OnePlus 11R 5G :
సరసమైన ధరలో టాప్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే.. (OnePlus 11R 5G) వంటి ఫోన్ మార్కెట్లో మరొకటి లేదు. రూ. 39,999 ప్రారంభ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్, బ్లేజింగ్-ఫాస్ట్ 100W ఛార్జింగ్, వన్‌ప్లస్ 11 5G క్వాలిటీ కలిగి ఉంది. అసాధారణమైన ప్రైమరీ కెమెరాతో సహా ఆకట్టుకునే ఫీచర్‌లతో వస్తుంది. 6.74-అంగుళాల డిస్ప్లేతో స్టైలిష్ డిజైన్‌ కలిగి ఉంది. రెండు వైపులా కర్వడ్ ఎడ్జెస్, బెజెల్‌లను కలిగి ఉంది. గరిష్టంగా 16GB RAM, 12GB వరకు వర్చువల్ RAMతో, OnePlus 11R 5G గేమర్‌లు, లాంగ్ లైఫ్ బ్యాటరీని పొందవచ్చు.

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!

2. Realme 11 Pro+ 5G :
అత్యుత్తమ ఫోన్ల జాబితాలో (Realme 11 Pro+) కూడా ఒకటి.. రూ. 40వేల లోపు ధరలో ఈ కొత్త ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ. 27,999లకే రియల్‌మి 11 ప్రో ప్లస్ (5G) సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి 11 Pro+ ఫోన్ అద్భుతమైన డిజైన్ అందిస్తుంది. మల్టీమీడియా కంటెంట్ లేదా గేమింగ్ అయినా స్లోడౌన్‌లు లేకుండా రన్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ సౌలభ్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, (Realme 11 Pro+) మంచి లైటింగ్ పరిస్థితులలో కనిపించే ఫొటోలను కూడా క్యాప్చర్ చేస్తుంది. రియల్‌మి (RealmeUI 4)లో అధిక బ్లోట్‌వేర్ కారణంగా సాఫ్ట్‌వేర్ పరంగా కొద్ది సమస్య తలెత్తవచ్చు.

Best Smartphones to buy in India under Rs 40,000 in June 2023

Best Smartphones in June 2023 under Rs 40,000 

3. Vivo V27 Pro 5G :
సరసమైన ధరలో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 40వేల లోపు ధరలో వివో (Vivo V27 Pro 5G) ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ప్రొఫైల్, డిజైన్‌ పరంగా ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది. వివో ఫోన్ ప్రత్యేక ఫీచర్లలో ఒకటి కెమెరా సిస్టమ్, షార్ప్, నైట్ షాట్‌లతో పాటు పగటిపూట ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. ఇందులోని స్పీకర్‌లు కూడా చాలా అప్‌గ్రేడ్ అయ్యాయి. వివో V27 ప్రో ఫోన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది.

4. Samsung Galaxy A54 5G :
ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లతో వచ్చిన అనేక స్మార్ట్‌ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ A54 5G ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. గెలాక్సీ S23 లైన్‌ను పోలి ఉంటుంది. కానీ, దాదాపు సగం ధరకే వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A54 అనేక ఫీచర్లను అందిస్తుంది. 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. అదనంగా, ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. సెంట్రల్లీ-అలైన్డ్ హోల్-పంచ్ కటౌట్‌లో ఆకట్టుకునే 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా నుంచి 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5,000mAh బ్యాటరీతో రూ. 40వేల కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ నాలుగు ఫోన్లలో మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేసుకోండి.

Read Also : Apple iPhone 11 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11పై భారీ తగ్గింపు.. కేవలం రూ. 8,950 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!