Bajaj Platina Bike Offer : రియల్‌మి 9 5G ఫోన్ ధరకే బజాజ్ ప్లాటినా బైక్ సొంతం చేసుకోవచ్చు.. ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. డోంట్ మిస్..!
Bajaj Platina Bike Offer : తక్కువ ధరకే బైక్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఆఫర్.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే బజాజ్ ప్లాటీనా బైక్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

Bajaj Platina Bike Offer _ Buy Bajaj Platina Bike in Realme 9 5g price, Here Full Details
Bajaj Platina Bike Offer : తక్కువ ధరకే బైక్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఆఫర్.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే బజాజ్ ప్లాటీనా బైక్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ బజాజ్ ప్లాటీనా బైక్ (Bajaj Platina Bike) ఆఫర్ కేవలం రియల్‌మి 9 5G ఫోన్ (రూ. 15,335) ధరకే సొంతం చేసుకోవచ్చు. బజాజ్ ప్లాటినా సెకండ్ హ్యాండ్ బైక్ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైకుల్లో ఒకటైన బజాజ్ ప్లాటినా ధర రూ. 68 వేల నుంచి లభ్యమవుతుంది. అదేవిధంగా, టాప్ వేరియంట్ బైక్ ధర రూ. 72 వేల వరకు ఉంటుంది.
అధిక మైలేజ్ బైక్ కోరుకునే వినియోగదారులు తక్కువ బడ్జెట్‌లో సెకండ్ హ్యాండ్ బైక్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ టూవీలర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ బజాజ్ ప్లాటినా బైక్ OLXలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 2012 మోడల్ ఇయర్ ప్లాటినా బైకు తక్కువ ధరకే లభిస్తోంది. ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసేముందు బైక్ కండిషీన్ ఎలా ఉందో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది. ఆ తర్వాతనే ఆ సెకండ్ బైక్ కొనుగోలు చేయాలి. Realme 9 5G స్మార్ట్‌ఫోన్ ధరలో ఎక్కువ మైలేజీ అందించే బజాజ్ ప్లాటినాను ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Bajaj Platina Bike Offer _ Buy Bajaj Platina Bike in Realme 9 5g price
మీరు బజాజ్ ప్లాటినాను షోరూమ్ నుంచి కొనుగోలు చేస్తే.. మీరు 68 వేల నుంచి రూ. 72 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి.. భారత టూ వీలర్ సెక్టార్‌లో బజాజ్ ఆటో అధిక మైలేజీని అందించే వైడ్ రేంజ్ బైక్‌లతో అగ్రగామి కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ శ్రేణిలోని బైక్‌లలో ఒకటి బజాజ్ ప్లాటినా (Bajaj Platina) తక్కువ ధర, అధిక మైలేజ్, తక్కువ బరువు కారణంగా చాలా కాలంగా మార్కెట్లో డిమాండ్ ఉంది.
బజాజ్ ప్లాటినా ప్రారంభ ధర 68 వేల నుంచి మొదలై రూ. 72 వేల వరకు ఉంటుంది. మీరు కూడా ఈ మైలేజ్ బైక్‌ని ఇష్టపడితే వెంటనే కొనుగోలు చేయొచ్చు. ఈ బైక్ సెకండ్ హ్యాండ్ మోడల్‌పై లభించే ఆఫర్లకు సంబంధించి వివరాలను తప్పక తెలుసుకోవాలి. సెకండ్ హ్యాండ్ బజాజ్ ప్లాటినాపై ఈ ఆఫర్‌లు ఒకసారి వాడిన వాహనాల కొనుగోలు, అమ్మకం, లిస్టింగ్‌లో వ్యవహరించే వివిధ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Bajaj Platina Bike Offer _ Buy Bajaj Platina Bike in Realme 9 5g price
సెకండ్ హ్యాండ్ బజాజ్ ప్లాటినా :
సెకండ్ హ్యాండ్ బజాజ్ ప్లాటినాపై మొదటి చౌక డీల్ OLX వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఢిల్లీ నంబర్ ప్లేట్‌తో 2012 మోడల్ ఇయర్ ప్లాటినా అని చెప్పవచ్చు. డీలర్ ఈ బైక్‌కు రూ. 15వేల ధరను నిర్ణయించారు. అయితే ఈ బైక్‌తో ఎలాంటి ఆఫర్ లేదా ప్లాన్ అందుబాటులో ఉండవని గమనించాలి. యూజ్డ్ బజాజ్ ప్లాటినాపై మరో చౌకైన ఆఫర్ BIKES4SALE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ప్లాటినా 2014 మోడల్ అందుబాటులో ఉంది. ఈ బైక్ ధర రూ. 22 వేలకు లభ్యమవుతుంది.
ఈ బైక్ కొనుగోలుపై ఫైనాన్స్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. బజాజ్ ప్లాటినా సెకండ్ హ్యాండ్ మోడల్‌పై అత్యంత చౌకైన డీల్ QUIKR వెబ్‌సైట్‌లో ఉంది. ఈ బైక్ మోడల్ 2015 మోడల్ కాగా రిజిస్ట్రేషన్ ఢిల్లీకి చెందినది. ఈ బైక్ ధర రూ. 25 వేలుగా ఉంది. అయితే ఈ బైక్‌తో డీలర్ నుంచి ఎటువంటి ఆఫర్ లేదా ఫైనాన్స్ ప్లాన్ అందుబాటులో ఉండదు. బజాజ్ ప్లాటినా సెకండ్ హ్యాండ్ మోడల్‌లో ఈ ఆఫర్‌ల ద్వారా ఏదైనా బైక్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ముందు బైక్ కండిషన్ చెక్ చేయాలి. లేకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.