LPG Cylinder : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

కేంద్ర చమురు సంస్ధలు నేటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. 19 కిలోలు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.135లు తగ్గించాయి.

LPG Cylinder : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

Lpg Cylinder

LPG Cylinder :  కేంద్ర చమురు సంస్ధలు నేటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. 19 కిలోలు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.135లు తగ్గించాయి. 19 కిలోలు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం 2,355 ఉండగా 135 తగ్గి అది రూ. 2,219 అయ్యింది.

కోల్ కతా లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రేటు తగ్గగా రూ.2,322గానూ, ముంబైలో రూ.2,171, చెన్నైలో రూ.2,373కి తగ్గింది. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పులేదు. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించటంతో  వ్యాపార వర్గాలవారు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Also Read : Massage Centre : మసాజ్ పేరుతో వ్యభిచార రొంపిలోకి-వ్యక్తి ఆత్మహత్య