Flipkart Big Billion Days Sale : పండుగ సీజన్ ముందుగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billion Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్లను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? పండుగ సీజన్‌ (Festival Season Sale)కు ముందుగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 ప్రారంభం కానుంది.

Flipkart Big Billion Days Sale : పండుగ సీజన్ ముందుగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billion Days Sale 2023 Instant Bank Discount Details Teased

Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 (Flipkart Big Billion Days Sale in 2023) పండుగ సీజన్‌కు ముందుగానే ప్రారంభం కానుంది. అధికారిక సేల్ తేదీలను ప్రకటించడానికి ముందే, ఇ-కామర్స్ వెబ్‌సైట్ వార్షిక విక్రయ సమయంలో అందుబాటులో ఉండే బ్యాంక్ ఆఫర్‌ (Bank Istant Discount Sale )లను రివీల్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ కార్డ్‌లు, EMI లావాదేవీల ద్వారా చేసిన కొనుగోళ్లకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను అందించడానికి ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కోటక్ బ్యాంక్‌లతో సహా వివిధ రుణదాతలతో భాగస్వామ్యం కలిగి ఉంది.

ఇంకా, ఆసక్తిగల కొనుగోలుదారులు (Paytm) ఆధారిత ఆఫర్‌లను పొందవచ్చు. పండుగ సేల్ వివిధ కేటగిరీలపై డిస్కౌంట్లను అందిస్తుంది. కొత్త ప్రొడక్టులను లాంచ్‌లను కూడా రివీల్ చేయనుంది. ఎప్పటిలాగే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు (Flipkart Plus Members) సేల్‌కి ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు. Apple, iQoo, OnePlus, Samsung, Realme, Xiaomi వంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లు సేల్ సమయంలో ధర తగ్గింపులను అందించనుంది.

ఫోన్ల కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023కి సంబంధించి ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ పేజీని కూడా పబ్లీష్ చేసింది. (Flipkart Mcirosite) బ్యానర్ ప్రకారం.. ఈ-కామర్స్ కంపెనీ షాపర్‌లకు ఎంపిక చేసిన ప్రొడక్టుల కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ తగ్గింపును పొందే అవకాశాన్ని అందించనుంది.

Read Also : Flipkart Smart TV Sale : ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్ టీవీ సేల్.. ఈ కొత్త స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన టీవీని ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో పాటు Paytm సేల్ సమయంలో Paytm, UPI, Wallet లావాదేవీలపై హామీ సేవింగ్స్ అందిస్తోంది. కస్టమర్‌లు తమ కొనుగోళ్లపై ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ (Flipkart Pay Later) ఫీచర్‌ను కూడా ఉపయోగించవచ్చు. అదనంగా, నో-కాస్ట్ EMIs, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు వంటి ఆప్షన్లు ఉంటాయి.

Flipkart Big Billion Days Sale 2023 Instant Bank Discount

Flipkart Big Billion Days Sale Offers And Discounts 

స్మార్ట్‌ఫోన్లపై 80శాతం డిస్కౌంట్ :
Apple, Samsung, Google, Realme, Oppo, Xiaomi, Nothing, Vivo వంటి బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లు సేల్ సమయంలో 80 శాతం వరకు తగ్గింపును పొందనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే కొన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లను టీజ్ చేసింది. Moto G54 5G, Samsung Galaxy F34 5G, Realme C51, Realme 115G, Realme 11x 5G, Infinix Zero 30 5G, Moto G84 5G, Vivo V29e, Poco M6 Pro 5G వంటి హ్యాండ్‌సెట్‌లు ఈ ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ధర తగ్గింపులను అందించనుంది.

అక్టోబర్‌లో ఐఫోన్ సహా ఇతర ఫోన్లపై డిస్కౌంట్ :
ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13 లైనప్ కూడా ధర తగ్గింపులను చూడవచ్చు. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S23 అల్ట్రా రూ. 92వేల ధర ట్యాగ్‌లో (బ్యాంక్ ఆఫర్‌లతో సహా) సేల్స్ సమయంలో అందుబాటులో ఉంటుందని అంచనా. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్, పిక్సెల్ 6 సిరీస్‌లు కూడా తగ్గింపులను అందుకోవచ్చనని భావిస్తున్నారు.

ఎప్పటిలాగే, ఫ్లిప్‌కార్ట్ సేల్ ఫస్ట్ రోజు వరకు ప్రధాన డీల్‌లను రివీల్ చేస్తుంది. ఐఫోన్ డీల్స్ అక్టోబర్ 1న వెల్లడి కానుండగా, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అక్టోబర్ 3న టీజ్ చేయనుంది. (Xiaomi) స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లను అక్టోబర్ 7న వెల్లడిస్తుంది. అయితే, పిక్సెల్ హ్యాండ్‌సెట్‌లపై ఆఫర్లు అక్టోబర్ 5న లాంచ్ కానున్నాయి.

Read Also : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్లు, ఇతర డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఎప్పటినుంచంటే?