Flipkart Big Saving Days Sale : ఆగస్టు 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. ఐఫోన్ 14, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

Flipkart Big Saving Days Sale : స్వాతంత్ర్య దినోత్సవానికి కొద్ది రోజుల ముందుగానే ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. విక్రయించనున్న 5G ఫోన్‌ల జాబితాను కంపెనీ వెల్లడించింది.

Flipkart Big Saving Days Sale : ఆగస్టు 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. ఐఫోన్ 14, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

Flipkart Big Saving Days Sale announced ahead of Independence Day

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) రాబోయే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈవెంట్ ఆగష్టు 5న జరుగుతుందని ప్రకటించింది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ స్వాతంత్ర్య దినోత్సవానికి కొద్ది రోజుల ముందు.. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ధృవీకరించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆగస్ట్ 4న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దీనిపై టీజర్‌ను రివీల్ చేసింది. విక్రయానికి రానున్న కొన్ని ఫోన్‌ల లిస్టును వెల్లడించింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 14, ఐఫోన్ 11 లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, డివైజ్ ప్లాట్‌ఫారమ్‌లో వరుసగా రూ.68,999, రూ. 41,999కి కొనుగోలు చేయొచ్చు. ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్ కొన్ని పాపులర్ 5G ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందించిన రికార్డును కూడా కలిగి ఉంది. అందుకే, కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Also : Ola Electric : జూలైలోనూ ఓలాదే ఆధిపత్యం.. ఈవీ మార్కెట్లో 40శాతం వాటాతో జోరుగా అమ్మకాలు..!

అదనంగా, సేల్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్‌పై కూడా డిస్కౌంట్ అందిస్తుంది. మినీ సిరీస్ స్థానంలో ఆపిల్ 2022లో ప్లస్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. కానీ, కొత్త ప్లస్ వెర్షన్‌కు కంపెనీ బెస్ట్ సేల్ రెస్పాన్స్‌ను అందుకోలేదని నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ మాదిరిగా అదే ఫోన్ చాలా పెద్ద డిస్‌ప్లే, కొంచెం పెద్ద బ్యాటరీ యూనిట్‌తో ఉంటుంది.

Flipkart Big Saving Days Sale announced ahead of Independence Day

Flipkart Big Saving Days Sale announced ahead of Independence Day

ఐఫోన్‌లతో పాటు Samsung Galaxy S22+ కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం రూ. 59,999కి లిస్టు అయింది. అయితే ఈ ఫోన్ తక్కువ ధరకు విక్రయించనుంది. అదేవిధంగా, Pixel 6a, Samsung Galaxy Z Flip 3 మరిన్ని వంటి ఇతర ఫోన్‌లపై కూడా డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ 5G ఫోన్‌ల కచ్చితమైన డీల్ ధర రాబోయే రోజుల్లో లేదా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈవెంట్‌కు ముందు వెల్లడించనుంది. ఇతర డివైజ్‌ల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతానికి, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ రాబోయే ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో అందుబాటులో ఉండే బ్యాంక్ కార్డ్, డిస్కౌంట్ ఆఫర్‌లను ధృవీకరించలేదు. ఈ సేల్ ఆగస్ట్ 4న మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభం కానుంది.

Read Also : Android Users Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో.. ఈ ఫేక్ యాప్ వెంటనే డిలీట్ చేసేయండి..!