Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. సోమవారం ఉదయం 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం

Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?

Gold

Gold and Silver Rate Today 9th October 2023: మీరు బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్.! బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత పదిహేను రోజులుగా వరుసగా తగ్గుకుంటూ వచ్చిన గోల్డ్ ధరలు.. మూడు రోజులుగా పెరుగుతున్నాయి. దీంతో తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. గత మూడు రోజులుగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 పెరుగుదల చోటు చేసుకుంది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 400 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 440 పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. సోమవారం ఉదయం 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 53,150కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 57,980 వద్ద కొనసాగుతుంది.

gold

gold

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 58,130 వద్దకు చేరింది.
– చెన్నైలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 53,700కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,580 వద్ద కొనసాగుతుంది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 53,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,980 వద్ద కొనసాగుతుంది.

gold

gold

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,000 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,000 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్ కతాలలో కిలో వెండి రూ.72,100 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 68,800 వద్ద ఉంది.