Kia Seltos 2023 Launch : ఏడు వేరియంట్లలో కొత్త కియా సెల్టోస్ 2023 కారు వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఏ వేరియంట్ ధర ఎంతో తెలుసా?

Kia Seltos 2023 Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే భారత మార్కెట్లోకి కియో ఇండియా (Kia India) నుంచి కొత్త మిడ్ సైజ్ SUV కారు వచ్చేసింది. అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ SUVలలో ఇదొకటి.

Kia Seltos 2023 Launch : ఏడు వేరియంట్లలో కొత్త కియా సెల్టోస్ 2023 కారు వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఏ వేరియంట్ ధర ఎంతో తెలుసా?

Kia Seltos 2023 launched in India _ Get price, new features, other details here

Kia Seltos 2023 Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే భారత మార్కెట్లోకి కియో ఇండియా (Kia India) నుంచి కొత్త మిడ్ సైజ్ SUV కారు వచ్చేసింది. అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ SUVలలో ఇదొకటి. కియా ఇండియా సెల్టోస్ (ia Seltos 2023) అవతార్‌ మరిన్ని ఫీచర్లతో పవర్‌ట్రెయిన్‌లతో లాంచ్ అయింది. రాబోయే రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE)కి అనుగుణంగా ఉంటుంది. నిబంధనలు, E20 ఇంధనానికి అనుకూలంగా ఉంటాయి. కియా సెల్టోస్ 2023 ప్రారంభ ధర రూ. 10.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. మీకు నచ్చిన ఏరియంట్ ధర ఎంత? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

కియా సెల్టోస్ 2023 ఫీచర్లు :
కియా ఇండియా (Idle Stop Go), (ISG)ని సెల్టోస్ 2023కి ప్రామాణిక ఫీచర్‌గా అందించింది. SUV అమెజాన్ అలెక్సాలో కియా కనెక్ట్ స్కిల్‌ను కూడా కలిగి ఉంది. హోమ్ టు కార్ కనెక్టివిటీ ఫంక్షన్ కూడా అందించారు. ఈ ఫీచర్ ప్రామాణికం కాదని గమనించాలి.

కియా సెల్టోస్ 2023 పవర్‌ట్రెయిన్‌లు :
కొత్త సెల్టోస్ పవర్‌ట్రెయిన్‌లలో కొన్ని మార్పులతో వచ్చింది. 1.4-లీటర్ టర్బో GDi ఇంజిన్ నిలిపివేసింది. కియా త్వరలో మరింత శక్తివంతమైన 1.5-లీటర్ టర్బో GDi ఇంజన్‌ని మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతానికి, SUVకి రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్, 1.5-లీటర్ CRDi VGT డీజిల్ ఆప్షన్ కలిగి ఉంది.

Read Also : Hyundai Verna 2023 : హ్యుందాయ్ వెర్నా 2023 మోడల్ కారు వచ్చేస్తోంది.. మార్చి 21నే లాంచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 115PS పవర్, 144Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. 6-స్పీడ్ MT లేదా IVT ఆటోమేటిక్‌తో వస్తుంది. డీజిల్ ఇంజన్ గరిష్టంగా 116PS శక్తిని (115PS), 250Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. 6-స్పీడ్ iMT లేదా 6-స్పీడ్ ATతో వచ్చింది. డీజిల్ ఇంజిన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదు. 6-స్పీడ్ iMT ప్రామాణికమైనదిగా చెప్పవచ్చు.

Kia Seltos 2023 launched in India _ Get price, new features, other details here

Kia Seltos 2023 Launch : Kia Seltos 2023 launched in India _ Get price, new features

కియా సెల్టోస్ 2023 వేరియంట్లు :
కొత్త సెల్టోస్ మోడల్ కారు HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, X Line ఏడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

కియా సెల్టోస్ 2023 ధర ఎంతంటే? :
కియా సెల్టోస్ ధర రూ. 10.89 లక్షలతో మొదలై రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. SUV వేరియంట్ వారీ ధర (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

1.5-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్ :

HTE 6MT – రూ. 10.89 లక్షలు
HTK 6MT – రూ. 12 లక్షలు
HTK+ 6MT – రూ. 13.10 లక్షలు
HTX 6MT – రూ. 14.90 లక్షలు
HTX IVT – రూ. 15.90 లక్షలు

1.5-లీటర్ CRDi VGT డీజిల్ :

HTE 6iMT – రూ. 12.39 లక్షలు
HTK 6iMT – రూ. 13.69 లక్షలు
HTK+ 6iMT – రూ. 15.29 లక్షలు
HTX 6iMT – రూ. 16.59 లక్షలు
HTX+ 6iMT – రూ. 17.59 లక్షలు
HTX AT – రూ. 17.59 లక్షలు
GTX+ AT – రూ. 19.35 లక్షలు
X లైన్ AT – రూ. 19.65 లక్షలు

Read Also : Hyundai Verna 2023 : అద్భుతమైన ఫీచర్లతో హ్యుందాయ్ వెర్నా 2023 కారు వచ్చేసింది.. మైలేజ్, ధర ఎంతంటే?