Mahindra Thar SUV : ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వచ్చేస్తున్న 5 డోర్ల మహీంద్ర థార్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Mahindra Thar SUV : మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి 5 డోర్ల థార్ SUV కారు వచ్చేస్తోంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో రానుంది.

Mahindra Thar SUV : ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వచ్చేస్తున్న 5 డోర్ల మహీంద్ర థార్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Mahindra Thar 5-door to come with electric sunroof

Mahindra Thar SUV 5-door to come with electric sunroof : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా (Mahindra & Mahindra) 5-డోర్ల థార్‌ను వచ్చే ఏడాది అంటే.. 2024లో భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. మహీంద్రా Q4, FY23 ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటో, ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ.. 5-డోర్ల థార్ 2023లో కాకుండా 2024లో లాంచ్ అవుతుందని వెల్లడించారు.

ఇప్పుడు 2024 మహీంద్రా థార్ 5-డోర్ SUV మోడల్‌కు సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో షేర్ అయింది. ఆ ఫొటోలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో మహీంద్రా థార్ SUV కారు కనిపించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించే 3-డోర్ల థార్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లేదు.

Read Also : Lexus GX SUV : 2024 లెక్సస్ GX లగ్జరీ ఫుల్ సైజ్ SUV కారు.. డిజైన్ అదుర్స్.. గ్లోబల్ లాంచ్ ఎప్పుడంటే?

అంతేకాకుండా, 2024 మహీంద్రా థార్ 5-డోర్ కూడా 3-డోర్ థార్ మాదిరిగా కాకుండా, కన్వర్టిబుల్ టాప్, హార్డ్ టాప్ ఆప్షన్‌లతో హార్డ్ టాప్‌ని కలిగి ఉండొచ్చు. స్టాండర్డ్‌గా ఈ ఏడాది ప్రారంభంలో, మహీంద్రా 3-డోర్ థార్ RWD వేరియంట్‌ను లాంచ్ చేసింది. SUV మోడల్ మొదట అక్టోబర్ 2020లో 4WD ప్రామాణికంగా ప్రవేశపెట్టారు.

Mahindra Thar 5-door to come with electric sunroof

Mahindra Thar SUV 5-door to come with electric sunroof

3-డోర్ థార్ మూడు ఇంజన్ ఆప్షన్‌లను కలిగి ఉంది. 1.5-లీటర్ D117 CRDe డీజిల్ (117bhp/300Nm), 2.2-లీటర్ mHawk 130 CRDe డీజిల్ (130bhp/300Nm), 2.0-లీటర్ mStallion/Tallion0Nm 150 (31TALLION 150) కలిగి ఉంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను 6-స్పీడ్ MTతో రావొచ్చు.

2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ పెట్రోల్ మిల్లులు 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్లను కలిగి ఉన్నాయి. 3-డోర్ థార్ ధర రూ. 10,54,500 నుంచి రూ. 16,77,501 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా.. 2024 మహీంద్రా థార్ 5-డోర్ ప్రీమియంతో రానుంది. ఈ SUV కారు ధర రూ. 2 లక్షల వరకు ఉండవచ్చు.

Read Also : MG Gloster Blackstorm : అద్భుతమైన ఫీచర్లతో ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ SUV కారు.. ధర ఎంతో తెలుసా?