New Kia Sonet Launch : 2024లో కొత్త కియా సోనెట్ కారు వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చుంటే?

New Kia Sonet Launch : కియా సోనెట్ మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300 వంటి వాటికి ప్రత్యర్థిగా వస్తుంది.

New Kia Sonet Launch : 2024లో కొత్త కియా సోనెట్ కారు వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చుంటే?

New Kia Sonet launch in India in first half of 2024

New Kia Sonet Launch : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ కియా ఇండియా (Kia India) 2024 ప్రథమార్థంలో దేశ మార్కెట్లో కొత్త సోనెట్‌ను లాంచ్ చేస్తుంది. సెప్టెంబర్ 2020లో లాంచ్ సమయం నుంచి సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV పొందే మొదటి ప్రధాన అప్‌డేట్ కానుంది.

Read Also : Apple iPhones Discounts : ఆపిల్ పాత ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఐఫోన్ ధర ఎంతంటే? కొత్త ఐఫోన్ 15 సిరీస్‌పై అదిరే డిస్కౌంట్లు..!

కియా సోనెట్ మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. సెల్టోస్‌తో పాటు కియాకు సోనెట్ వాల్యూమ్ డ్రైవర్‌గా ఉన్నప్పటికీ, గత 2 నెలల్లో హోల్‌సేల్‌లు దెబ్బతిన్నాయి. కియా సోనెట్ జూలై, ఆగస్టులలో వరుసగా 4,245 యూనిట్లు, 4,120 యూనిట్ల టోకులను నమోదు చేసింది.

New Kia Sonet launch in India in first half of 2024

New Kia Sonet Launch in India in first half of 2024

FY23లో వాహనం సగటు నెలవారీ పరిమాణం 7,841 యూనిట్లు (మొత్తం ఆర్థిక సంవత్సరానికి 94,096 యూనిట్లు) కన్నా చాలా తక్కువ. ఇతర కాంపాక్ట్ SUV నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. కొత్తగా అప్‌డేట్ చేసిన Kia Sonet త్వరలో మార్కెట్లోకి ప్రవేశించనుంది. 2024లో కొత్త సోనెట్‌ను లాంచ్ చేయనుందని నివేదిక తెలిపింది. ఈ వాహనం వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్లోకి ప్రవేశించవచ్చునని పేర్కొంది.

సోనెట్ అనేది కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో అత్యంత ఫీచర్-లోడెడ్ మోడల్‌లలో ఒకటి. అనేక సెగ్మెంట్-ఫస్ట్ సెగ్మెంట్-బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. మల్టీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను అందిస్తుంది. ప్రస్తుతం రూ. 7.79 లక్షల నుంచి రూ. 14.89 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరను కలిగి ఉంది. సోనెట్, కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో అత్యంత విలువైన మోడల్‌లలో ఒకటిగా ఉండనుంది.

Read Also : Xiaomi 13T Pro Series Leak : షావోమీ 13T సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?