Nothing Phone (1) : సరికొత్త టెక్నాలజీతో నథింగ్ ఫోన్ (1).. ఫీచర్లు చూస్తే ఫిదానే.. జూలై 21 నుంచే సేల్!
Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లండన్ ఆధారిత కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (1) వచ్చేసింది. జూలై 12న గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ నథింగ్ ఫోన్ (1) సరికొత్త టెక్నాలజీతో వచ్చింది. చక్కటి డిజైన్‌తో, నథింగ్ ఫోన్ (1) చాలా కొత్తదనాన్ని అందించనుంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్లో లైటింగ్ స్ట్రిప్స్‌ను కలిగి ఉంది. ఇప్పటివరకు ఏ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇలా ప్రయత్నించలేదు. స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు అద్భుతంగా ఉన్నాయి. నథింగ్ ఫోన్ (1) 33W ఛార్జర్‌కు సపోర్టు ఇస్తుంది.
సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ నథింగ్ ఫోన్ (1)కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నథింగ్ బ్రాండ్ నుంచి మొదటి స్మార్ట్‌ఫోన్ కాగా.. మొత్తం 3 వేరియంట్లలో వైట్, బ్లాక్ సహా రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. నథింగ్ ఇయర్ (1) మాదిరిగానే.. నథింగ్ ఫోన్ (1) 900 LED లైట్లు, ఇంటర్నల్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో ట్రాన్స్పరెంట్ డిజైన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 32,999 నుంచి రూ. 38,999 వరకు ఉంటుంది. జూలై 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1) సేల్ ప్రారంభం కానుంది.
Nothing Phone (1) specifications :
Display: నథింగ్ ఫోన్ (1) 60hz నుంచి120hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్ప్లేతో వచ్చింది. ఫ్రంట్, బ్యాక్ HDR10+ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్‌తో వచ్చింది.
Processor: స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 778+ SoCతో పాటు 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రన్ అవుతుంది.
RAM: రెండు RAM వెర్షన్లలో వస్తుంది.. అందులో ఒకటి 8GB, రెండోది 12GB వెర్షన్.
Storage: 128GB, 256GB రెండు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
Battery: 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. కానీ, రిటైల్ బాక్స్ ఛార్జింగ్ క్లియర్ కేస్‌తో రాదు. టైప్ C కేబుల్ ఉండదు.
Rear camera : ఈ ఫోన్ (1) వెనుక ప్యానెల్లో 50-MP Sony IMX766 సెన్సార్ + 50-MP Samsung JN1 సెన్సార్‌ను కలిగి ఉంది.
Front camera : సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం హోల్ పంచ్ డిస్ప్లే లోపల 16-MP ఫ్రంట్ కెమెరా ఉంది.
Software : నథింగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 12లో నథింగ్ OS కస్టమ్ స్కిప్తో రన్ అవుతుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
Nothing Phone (1) top features
– ప్రతి 2 నెలలకు 3 ఏళ్లవరకు ఆండ్రాయిడ్ సపోర్ట్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని హామీ ఇస్తోంది.
– సెక్యూరిటీ పరంగా.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.
– నథింగ్ ఫోన్ (1)లో 900 LED లైట్లు ఉన్నాయి. కొత్త నోటిఫికేషన్, కాల్ లేదా మెసేజ్ లేదా ఈమెయిల్ వచ్చినప్పుడు వెలుగుతాయి.
– నథింగ్ ఫోన్ (1) 10 గ్లిఫ్ శాంపిల్స్ అందిస్తుంది. నిర్దిష్ట కాంటాక్టుల కోసం నిర్దిష్ట రింగ్టోన్లను సెట్ చేసేందుకు వీటిని ఉపయోగించవచ్చు.
– స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12OSతో పాటు నథింగ్OS స్కిన్‌తో వస్తుంది.
–NothingOS స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. యాడ్స్ లేదా బ్లోట్వేర్తో రాలేదు.
– కెమెరా యాప్‌లో స్టూడియో లైట్, గ్లిఫ్ లైట్ మోడ్ ఉన్నాయి. పరిమిత లైటింగ్‌లో కూడా వినియోగించవచ్చు.
Nothing Phone (1) price in India :
నథింగ్ ఫోన్ (1) మూడు వేరియంట్లలో వస్తుంది. ఇందులో బేస్ మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 32,999, 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్‌లతో సహా ఇతర రెండు మోడల్‌లు వరుసగా రూ. 35,999, రూ. 38,999 ధరలకు అందుబాటలో ఉండనున్నాయి. నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంక్‌తో భాగస్వామ్యంతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. కానీ, నథింగ్ ఫోన్ (1)ను ప్రీ-ఆర్డర్ చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
ఫ్లిప్ కార్ట్‌లో జూలై 21 నుంచే ఓపెన్ సేల్ :
ఫోన్ (1) ఓపెన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 21న రాత్రి 7PM నుంచి ప్రారంభం కానుంది. ఫోన్ ఆఫ్‌లైన్‌లో సేల్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్లను అందించనుంది. కంపెనీ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లు ఫోన్‌ను ప్రారంభ ధర రూ. 31,999 (8GB RAM + 128GB స్టోరేజ్), రూ. 34,999 (8GB RAM + 256GB స్టోరేజ్), రూ. 37,999 (12GB RAM, 256GB స్టోరేజ్)కు సొంతం చేసుకోవచ్చు.