Poco F5 5G India : పోకో F5 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈ రోజే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చు? లైవ్ స్ట్రీమ్ చూడాలంటే?

Poco F5 5G India : పోకో F5 5G ఫోన్ మే 9న భారత మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Poco F5 5G India : పోకో F5 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈ రోజే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చు? లైవ్ స్ట్రీమ్ చూడాలంటే?

Poco F5 5G India launch today_ Expected price and specs, how to watch livestream

Poco F5 5G India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో (Poco F5 5G) ఫోన్ ఈరోజు (మే 9న) సాయంత్రం భారత మార్కెట్లో లాంచ్ కానుంది. Poco F4 అప్‌గ్రేడ్ వెర్షన్‌తో తీసుకొస్తోంది. ఈ ఫోన్, బాక్స్ వెలుపల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఫస్ట్ గ్లోబల్ ఫోన్ (Poco F5) ఇదే కావొచ్చు. ఈ మేరకు కంపెనీ ఇంతకుముందు ట్వీట్‌లో వెల్లడించింది. గేమింగ్, ఫొటోగ్రఫీ అందించనుంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలను ఇంకా రివీల్ చేయలేదు.

పోకో F5 5G లాంచ్.. ధర (అంచనా) :
పోకో F5 ఫోన్ ధర రూ. 30వేల లోపు ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ బేస్ మోడల్‌ ధర రూ.28వేల నుంచి రూ.29వేల మధ్య ఉంటుంది. Poco F5 మిడ్-రేంజ్ ఫోన్, ఆ తర్వాత వచ్చిన Poco F4 కూడా రూ. 30వేల కన్నా తక్కువ ధరలో రానుంది. ఈ ఫోన్ మే 11న భారత మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది.

Read Also : Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. ఇంకా రెండు రోజులే సేల్.. త్వరపడండి..!

పోకో F5 5G లాంచ్.. లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే? :
Poco F5 కంపెనీ YouTube ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. మీరు Poco (YouTube) ఛానెల్‌కి వెళ్లి సాయంత్రం 5:30 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్‌లతో మీరు Poco ఇతర సోషల్ మీడియా ఛానెల్‌లను కూడా చూడవచ్చు.

Poco F5 5G India launch today_ Expected price and specs, how to watch livestream

Poco F5 5G India launch today_ Expected price and specs, how to watch livestream

పోకో F5 5G స్పెషిఫికేషన్లు :
ఇప్పటికే కంపెనీ ధృవీకరించినట్లుగా.. Poco F5 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఏడాది మార్చిలో Qualcomm Snapdragon 7+ Gen 2 చిప్‌సెట్‌ను ప్రకటించింది. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను అందించనుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్ టోన్-డౌన్ వెర్షన్, స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. రాబోయే Poco F5 పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని పోకో ఇండియా హెడ్ పేర్కొన్నారను. Poco F5 స్పెషిఫికేషన్లతో ఫోన్ కార్బన్ బ్లాక్, స్నో స్టార్మ్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది.

ఈ ఫోన్ 64 MP కెమెరాతో ‘హైపర్ స్టెబిలిటీ’తో వస్తుంది. పోకో ఫోన్ 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. హైపర్‌బూస్ట్ ఆప్టిమైజేషన్‌తో వస్తుంది. ఇతర లీకైన స్పెక్స్‌లో పంచ్-హోల్ నాచ్ డిజైన్‌తో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది. Poco F5 అదే ఫీచర్లతో రానుంది. ఈ డివైజ్ 5,000 mAh బ్యాటరీతో రావచ్చు. గత మోడల్ 4,500 mAh బ్యాటరీతో వచ్చింది.

Read Also : Flipkart Big Saving Sale : మే 5 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!