Poco M5 First Sale in India : పోకో నుంచి కొత్త బడ్జెట్ ఫోన్.. ఇండియాలో ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు ఇవే.. ధర ఎంతో తెలుసా?

Poco M5 First Sale in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త బడ్జెట్ (Poco M5) ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో Poco M5 ఆక్టా-కోర్ 6nm MediaTek Helio G99 SoC వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది.

Poco M5 First Sale in India : పోకో నుంచి కొత్త బడ్జెట్ ఫోన్.. ఇండియాలో ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు ఇవే.. ధర ఎంతో తెలుసా?

Poco M5 first sale in India today_ Poco M5 Two Variants With Different Prices and Specifications

Poco M5 First Sale in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త బడ్జెట్ (Poco M5) ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో Poco M5 ఆక్టా-కోర్ 6nm MediaTek Helio G99 SoC వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. రియల్ లెదర్ ప్యానెల్, పెద్ద కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది.

Poco M5 Poco M4కి అప్‌గ్రేడ్ వెర్షన్. బడ్జెట్ కేటగిరీలో కెమెరా పరంగా చూస్తే.. Poco M5 ఫ్రంట్ సైడ్‌లో 8MP సెన్సార్‌తో పాటు 50-MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ బడ్జెట్ ఫోన్ RAMని 2GB వరకు పొడిగించనుంది. అయితే ఈ డివైజ్ TurboRAMకి కూడా సపోర్టు ఇస్తుంది. Poco M5 బడ్జెట్ ఫోన్ భారత మార్కెట్లో ధర ఎంత ఉంది? ఏయే స్పెసిఫికేషన్‌లు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

Poco M5 first sale in India today_ Poco M5 Two Variants With Different Prices and Specifications

Poco M5 first sale in India today_ Poco M5 Two Variants With Different Prices

Poco M5: ధర ఎంతంటే? :
పోకో బడ్జెట్ ఫోన్ Poco M5 (4GB+64GB) వేరియంట్‌తో పాటు 6GB+128GB వేరియంట్‌ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ బేస్ 4GB+64GB ధర రూ.12,499, 6GB+128GB వేరియంట్ రూ.14,499  అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా Poco M5పై ప్రత్యేక డీల్స్, డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.

మీరు ICICI, Axis బ్యాంక్ కార్డ్ హోల్డర్ అయితే.. రూ. 1,500 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. సరికొత్త POCO M5పై బేస్ వేరియంట్‌కు కేవలం రూ. 10,999, అధిక వేరియంట్‌కు రూ. 12,999 ధరతో పొందవచ్చు. ఈ డివైజ్ Flipkart.com లో మధ్యాహ్నం 1 గంటలకు లైవ్ కామర్స్ ఈవెంట్ ద్వారా అందుబాటులో ఉంది.

Poco M5 first sale in India today_ Poco M5 Two Variants With Different Prices and Specifications

Poco M5 first sale in India today_ Poco M5 Two Variants With Different Prices

Poco M5 : స్పెసిఫికేషన్‌లు ఇవే :
Poco M5 Poco M4కి వెర్షన్.. ఈ రెండు వేరియంట్లలో పెద్దగా మార్పులు లేవు. Poco M5 వెనుక భాగంలో లెదర్ ఎండ్‌తో వస్తుంది. Poco M4 ప్లాస్టిక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లలో కెమెరా మాడ్యూల్ ఎక్కువ లేదా తక్కువ ఒకేలా కనిపిస్తుంది. Poco M5 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.58-అంగుళాల 90Hz FHD+ స్మార్ట్ డిస్‌ప్లేతో వస్తుంది.

స్క్రోలింగ్ కంటెంట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. కెమెరా విభాగంలో Poco M5 ముందు భాగంలో 8-MP షూటర్‌తో పాటు 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చాయి. Poco M5 సరికొత్త MediaTek Helio G99 6nm ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 6GB RAM, 128GB RAMతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వచ్చింది.

Read Also : Poco M5 : భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాలతో పోకో M5 వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?