Poco X5 Pro Discount : ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X5 ప్రోపై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఈ 5G ఫోన్ ఎందుకు కొనాలంటే..?
Poco X5 Pro Discount : ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X5 Pro భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ 5G ఫోన్ ధర రూ.19,999కి తగ్గింది. పోకో కొనుగోలుదారులు మొత్తం రూ. 3వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ఎందుకు కొనాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Poco X5 Pro Discount : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ పోకో (Poco) నుంచి (Poco X5 Pro) 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఈ డిస్కౌంట్ అందిస్తోంది. పోకో 5G ఫోన్ భారత మార్కెట్లో రూ.22,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ పోకో ఫోన్ ధర రూ.19,999కి పడిపోయింది.
Poco X5 Pro కొనుగోలుదారులు మొత్తం రూ. 3వేలు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో ప్రస్తుతానికి తెలియదు. అయితే ఈ డివైజ్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరలో అందుబాటులో ఉంది. పోకో X5 ప్రో కొనుగోలుకు 4 కారణాలను తెలుసుకుందాం.
పోకో X5 ప్రో కొనడానికి 4 కారణాలివే :
* Poco X5 Pro ఫోన్ 6.7-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ కలర్ ఆప్షన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. సూర్యకాంతిలో కంటెంట్‌ను చెక్ చేయడానికి స్క్రీన్కు తగినంత లైటింగ్ ఉంటుంది. ప్యానెల్ ఫుల్ HD+ రిజల్యూషన్‌లో పనిచేస్తుంది. పోకో ఫోన్ ముందు భాగంలో (Corning Gorilla Glass 5) కోటింగ్ కూడా ఉంది. ఈ డివైజ్ డైనమిక్ 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్‌కు సపోర్టు అందిస్తుంది.
Read Also : Poco M6 Pro 5G Launch : అదిరిపోయే ఫీచర్లతో పోకో M6 ప్రో 5G ఫోన్.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్..!
* ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందించగలదు. ఏ బ్రాండ్ ఈ చిప్‌సెట్‌ను రూ. 20వేలు లోపు అందించడం లేదని గమనించాలి. అంతేకాదు.. రూ. 25వేల నుంచి రూ. 40వేల మధ్య ధర ఉన్న డివైజ్‌లలో ఈ చిప్సెట్ ఎక్కువగా వినియోగిస్తారు. గేమింగ్ యూజర్లు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ పొందవచ్చు. (Genshin Impact) వంటి భారీ క్యాప్షన్లతో తక్కువ సెట్టింగ్‌లలో ప్లే చేస్తే.. ఈ 5G ఫోన్లో ప్లే చేయవచ్చు.
* 5,000mAh బ్యాటరీ యూనిట్‌తో, బ్యాటరీ లైఫ్ కూడా తగినంతగా అందిస్తుంది. కాల్ చేయడం, మెసేజింగ్ చేయడం వంటి ప్రాథమిక వినియోగంలో ఈ ఫోన్‌ని రోజుకు ఒకసారి మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ రిటైల్ బాక్స్‌లో 67W ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. 15 నిమిషాల వ్యవధిలో 50 శాతం ఛార్జ్‌ని అందిస్తుంది.
* ఈ స్మార్ట్‌ఫోన్ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫొటోలను కూడా క్యాప్చర్ చేయగలదు. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా ఉంది. 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో వస్తుంది. 4K వీడియోలను కూడా షూట్ చేయవచ్చు.
పోకో X5 Pro ఎందుకు కొనవద్దు.. 2 కారణాలివే :
* పోకో X5 Pro బ్లోట్వేర్తో వస్తుంది. ప్రీ ఇన్స్టాల్ యాప్‌లను డిలీట్ చేయొచ్చు. అయితే, కొన్ని స్థానిక (Xiaomi) యాప్‌లు రిమూవ్ చేయలేమని గమనించాలి. క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ను ఇష్టపడే వారికి, MIUI కొంచెం చికాకు కలిగించవచ్చు. ఈ మిడ్-రేంజ్ ఫోన్లో ఇతర యాప్‌లు మాత్రమే కాకుండా కొన్ని ఇబ్బందికరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. టెస్టింగ్ సమయంలో, ఉపయోగించని యాప్‌ల నుంచి స్పామ్ నోటిఫికేషన్లను పొందవచ్చు. యాప్ డ్రాయర్ను ఓపెన్ చేయగానే కొన్ని యాప్‌లతో కూడిన అదనపు విండో అకస్మాత్తుగా అందిస్తోంది.
* పోకో X5 ప్రో మోడల్ పాత ఆండ్రాయిడ్ 12 OSలో రన్ అవుతుంది. కేవలం 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లకు పరిమితం చేస్తుంది. పోకో X5 ప్రో వినియోగదారులు Android 14 OSని మాత్రమే యాక్సెస్ చేయగలరు. లాంచ్ చేసిన తర్వాత డివైజ్ Android 13కి అప్డేట్ కానుంది.