Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ సేల్.. రూ.20వేల లోపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డీల్స్..!

Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ సేల్ కొనసాగుతోంది. రూ.20వేల లోపు ధరలో పోకో X5 ప్రో, మోటో7 G54, రియల్‌మి 11x స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది.

Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ సేల్.. రూ.20వేల లోపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డీల్స్..!

Poco X5 Pro, Moto G54, Realme 11X Smartphone Deals Under Rs. 20K During Flipkart Sale in telugu

Flipkart Sale Offers : భారత అతిపెద్ద ఇ-కామర్స్ సైట్‌లలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం పండుగ సీజన్‌లో భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్ 2023 (Flipkart Dussehra Sale 2023) అక్టోబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 29 వరకు యూజర్లందరికి అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ సమయంలో, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌టీవీల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా పలు ప్రొడక్టులపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లు, డీల్‌లను అందిస్తుంది. ఈ ప్రొడక్టుల్లో కొన్ని లిస్టు చేసిన ధర కన్నా గణనీయమైన సేల్ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, రియల్‌మి, మోటోరోలా వంటి ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు సేల్ సమయంలో లాభదాయకమైన ధరలను అందిస్తోంది. రూ. 20వేల లోపు కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.

మోటో G84 5G ఫోన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ కాగా.. 6.55-అంగుళాల ఫుల్-HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) 120Hz pOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా పవర్ అందిస్తుంది. 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోన్ 12GB + 256GB వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18,999, రూ. 22,999 నుంచి 17 శాతం తగ్గింది. మార్ష్‌మెల్లో బ్లూ, మిడ్‌నైట్ బ్లూ, వివా మెజెంటా కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది. SBI, RBL, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డ్ యూజర్లు డీల్ ధరపై అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.

Read Also : Flipkart Sale End Today : ఇదే లాస్ట్ ఛాన్స్.. రూ.60వేల లోపు ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

పోకో X5 ప్రో 5G ఫోన్ 6.67-అంగుళాల (Xfinity) అమోల్డ్ 120Hz డిస్‌ప్లే, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 778G SoC, 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌లో 108ఎంపీ కెమెరాలు, (ISOCELL HM2) ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8MP సెన్సార్, వెనుకవైపు 2ఎంపీ మాక్రో కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఈ మోడల్ 6GB + 128GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో దసరా సేల్‌లో రూ. 18,499కు సొంతం చేసుకోవచ్చు.

ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తగ్గింపు ధరతో లభించే మరో స్మార్ట్‌ఫోన్ వివో T2 5G ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లో 6nm క్వాల్‌కామ్న్ స్నాప్‌డ్రాగన్ 695 SoC, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.38-అంగుళాల అమోల్డ్ (1,080 x 2,400 పిక్సెల్‌లు) 90Hz డిస్‌ప్లే, 2MP బోకె సెన్సార్‌తో పాటు 64ఎంపీ ప్రైమరీ రియర్ సెన్సార్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 6GB + 128GB ఆప్షన్ 25 శాతం తగ్గి రూ. 23,999 నుంచి రూ. 17,999 తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు.

Poco X5 Pro, Moto G54, Realme 11X Smartphone Deals Under Rs. 20K During Flipkart Sale in telugu

Poco X5 Pro, Moto G54, Realme 11X Smartphone Deals  

ఆగస్ట్‌లో భారత్‌లో లాంచ్ అయిన రియల్‌మి 11 5G ఫోన్ 6.72-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) శాంసంగ్ అమోల్డ్ 120Hz డిస్‌ప్లే, 108ఎంపీ శాంసంగ్ ISOCELL HM6 ప్రైమరీ రియర్ సెన్సార్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ SoC ద్వారా ఆధారితమైంది. 67W వైర్డు (SuperVOOC) ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్‌ను కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ధర రూ. 20,999 నుంచి (19 శాతం తగ్గింపు)తో రూ. 16,999కు పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ F34 5G మోడల్.. :

ఈ ఏడాది ప్రారంభంలో ఆగస్టులో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఇన్-హౌస్ ఆక్టా-కోర్ ఎక్సోనోస్ 1280 SoC, పెద్ద 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో6.46-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (2340 x 1080 పిక్సెల్‌లు) sAMOLED 120Hz డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సార్, 13MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ 6GB + 128GB ఆప్షన్ సేల్ సమయంలో ధర రూ. 24,499 నుంచి (32 శాతం తగ్గింపు)తో రూ. 16,499కు కొనుగోలు చేయొచ్చు.

మోటో G54 5G ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC, 33W వైర్డ్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ 120Hz డిస్‌ప్లే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. 12GB + 256GB వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అసలు ధర రూ. 21,999 నుంచి (27 శాతం తగ్గింపు) తో రూ. 15,999కు పొందవచ్చు.

రియల్‌మి 11x 5G ఫోన్ 6GB + 128GB వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై 17 శాతం తగ్గింపుతో అసలు ధర రూ. 16,999 నుంచి రూ. 13,999కు కొనుగోలు చేయొచ్చు. 6.72-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) అమోల్డ్ 120Hz డిస్‌ప్లే, 64ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 6nm మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ SoC ద్వారా పవర్ అందిస్తుంది. 33W వైర్డు SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Flipkart Sale Offers : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!