Reliance Digital : ‘డిజిటల్ ఇండియా సేల్’.. అదిరిపోయే ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు!

ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ స్టార్ట్ అయ్యింది. "రిలయన్స్ డిజిటల్" పేరుతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డిజిటల్ ఇండియా సేల్ మొదలైంది.

Reliance Digital : ‘డిజిటల్ ఇండియా సేల్’.. అదిరిపోయే ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు!

Reliance Digital

Digital India Sale: ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ స్టార్ట్ అయ్యింది. “రిలయన్స్ డిజిటల్” పేరుతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డిజిటల్ ఇండియా సేల్ మొదలైంది. జనవరి 26వ తేదీ వరకు ఈ సేల్ అన్ని రిలయన్స్ డిజిటల్ మై జియో స్టోర్స్ www.reliancedigital.inలో అందుబాటులో ఉండనుంది. కస్టమర్లు ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌పై అద్భుతమైన డీల్స్ పొందవచ్చు.

టీవీలు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, యాక్సెసరీస్ వంటి కేటగిరీల రేంజ్‌లో ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కేటగిరీలో కస్టమర్లకు డిస్కౌంట్‌లు, క్యాష్ బ్యాక్‌లు పొందవచ్చు. ఎంపిక చేసిన ఫోన్ల మీద యాక్సిడెంటల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ కూడా అందిస్తోంది.

ఎలక్ట్రానిక్స్‌పై ఉత్తమమైన డీల్‌లతో పాటు, రిలయన్స్ డిజిటల్ ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డ్‌పైనైనా 6శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ని అందిస్తోంది. సిటీ బ్యాంక్ కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ & EMI లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే, ప్రతి 5వేల రూపాయల కొనుగోలుపై వెయ్యి రూపాయల విలువైన రిలయన్స్ డిజిటల్ వోచర్‌లు పొందవచ్చు.

ఈ ఆఫర్లు 2022 జనవరి 26వ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటాయి. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్‌లు, వాషింగ్ మెషీన్‌లు, వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్స్‌పై ప్రత్యేక ఆఫర్లలో అందుబాటులో ఉన్నాయి. Vivo, Xiaomi, Samsung వంటి బ్రాండ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల ఆకర్షనీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. OnePlus 9RT 5Gని కేవలం 38వేల 999రూపాయలకే లభిస్తోంది. Samsung Galaxy S20FE 5G కేవలం రూ. 34,990కే అందుబాటులో ఉంది.

గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై కూడా చాలా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. HP Victus & Pavilion Gaming ల్యాప్‌టాప్‌ను రూ. 59వేల 999రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. Lenovo Core i3 8GB ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర 37వేల 990గా ఉంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మరియు ఇతర గృహోపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్‌లు ఉన్నాయి.