Reliance Jio Phone 5G : అతి చౌకైన ధరకే జియో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? లాంచ్ డేట్ ఎప్పుడంటే?
Reliance Jio Phone 5G : రిలయన్స్ జియోఫోన్ 5G త్వరలో లాంచ్ కానుంది. జియో నుంచి ఇది రెండో స్మార్ట్‌ఫోన్. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌లో 4G కనెక్టివిటీతో వచ్చింది.
Reliance Jio Phone 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే ఈ లాంచ్‌కు ముందు.. జియో ఫోన్ 5G గురించి చాలా డేటా లీక్ అయింది. జియో రెండో స్మార్ట్‌ఫోన్ అని గుర్తుంచుకోండి. కంపెనీ, ఇప్పటికే లాంచ్ చేసిన మొదటి స్మార్ట్‌ఫోన్‌లో 4G కనెక్టివిటీ ఉంది. అయితే, 5G కనెక్టివిటీని కలిగిన రెండవ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.
జియో 5G ఫోన్ లాంచ్ ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. జియో ఫోన్ 5G దీపావళికి ముందు ఈ ఏడాదిలో లాంచ్ కానుంది. అయితే, కంపెనీ ఇంకా అధికారిక లాంచ్ తేదీని ప్రకటించలేదు. గణేష్ చతుర్థి రోజున జియో ఫోన్ 5Gని లాంచ్ చేసే అవకాశం ఉంది. దీపావళి లేదా న్యూ ఇయర్లో కూడా ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని కొన్ని నివేదికలలో పేర్కొంది.
జియో ఫోన్ 5G స్మార్ట్‌ఫోన్ ధర :
భారత మార్కెట్లో రూ. 10 వేల కన్నా తక్కువ ఉంటుంది. జియో ఫోన్ 4G లాంచ్ ధర రూ.6,499 కన్నా తక్కువగా ఉంటుంది. జియో మరొక బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ అందిస్తుంది. ఎక్కువ మంది వినియోగదారులకు సహేతుకమైన ఖర్చుతో 5G టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశాన్ని అందిస్తుంది.
జియో ఫోన్ 5G ఫీచర్లు ఎలా ఉంటాయి? :
జియో ఫోన్ 5Gని కంపెనీ థీమ్ కలర్ డార్క్ బ్లూ వేరియంట్లో లాంచ్ చేయవచ్చు. పిల్ షేప్ బ్యాక్ కెమెరా మాడ్యూల్‌ను ఫోన్లో అందించవచ్చు. బ్యాక్ సైడ్ 13MP AI కెమెరా సెటప్, LED సపోర్టుతో 2MP మాక్రో కెమెరా సెటప్ ఉండవచ్చు. ముందు భాగంలో 5MP కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్‌ని ఫోన్లో ఉపయోగించుకోవచ్చు. చిప్సెట్ విషయంలో, ప్రస్తుతానికి నిర్దిష్ట సమాచారం లేదు. అయితే జియో ఫోన్ 5G Unisoc 5G చిప్సెట్ లేదా డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌కు సపోర్టు అందిస్తుందని లీకైన నివేదికలు తెలిపాయి.
Read Also : Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ లీక్.. భారత్‌లో వార్షిక సేల్ ఎప్పటినుంచంటే?