Rihanna: ఫోర్బ్స్‌లో రిహన్నా.. రిచెస్ట్‌ లేడీ మ్యూజీషియన్‌‌గా రికార్డ్!

ఎక్కడో అమెరికాలో పాప్ సింగర్.. కానీ ఇండియాలో రైతు ఉద్యమానికి కూడా మద్దతు ఇవ్వడం ఆ మధ్య అందరినీ ఆకర్శించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానులను సొంతం చేసుకున్న రిహన్నా ఒక్క రైతు ఉద్యమమే కాదు ప్రపంచంలో ఏ మూలాన ఎలాంటి ప్రజా సమస్యలు ఆమె దృష్టికి వచ్చినా స్పందిస్తుంది. ఇక ఆమె పాటల విషయానికి వస్తే.. వచ్చిన ప్రతి ఆల్బమ్ రెగ్యులర్ గా చార్ట్ బస్టర్స్ అవుతుంటాయి.

Rihanna: ఫోర్బ్స్‌లో రిహన్నా.. రిచెస్ట్‌ లేడీ మ్యూజీషియన్‌‌గా రికార్డ్!

Rihanna

Rihanna: ఎక్కడో అమెరికాలో పాప్ సింగర్.. కానీ ఇండియాలో రైతు ఉద్యమానికి కూడా మద్దతు ఇవ్వడం ఆ మధ్య అందరినీ ఆకర్శించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానులను సొంతం చేసుకున్న రిహన్నా ఒక్క రైతు ఉద్యమమే కాదు ప్రపంచంలో ఏ మూలాన ఎలాంటి ప్రజా సమస్యలు ఆమె దృష్టికి వచ్చినా స్పందిస్తుంది. ఇక ఆమె పాటల విషయానికి వస్తే.. వచ్చిన ప్రతి ఆల్బమ్ రెగ్యులర్ గా చార్ట్ బస్టర్స్ అవుతుంటాయి. యూఎస్ టాప్ మ్యూజీషియన్స్ లో ఆమె కూడా ఒకరు. ఇవన్నీ ఇప్పటి వరకు రిహన్నా గురించి అందరికీ తెలిసినవే.

కాగా, రిహానా తాజాగా రిచ్చెస్ట్ రికార్డ్ స్వంతం చేసుకుంది. రిహానా ఇప్పుడు ఫోర్ట్స్ రిచ్చెస్ట్ లేడీ మ్యూజీషియన్ గా మారిపోయింది. ఫోర్బ్స్ జాబితా ఆమె నెట్ వర్త్ 1.7 బిలియన్ అమెరికన్ డాలర్లుగా పేర్కొంది. అంటే మన కరెన్సీలో 12వేల 603కోట్ల పై మాటే. రిహానా నెట్ వర్త్ అంటూ ఫోర్బ్స్ కంపెనీ ఓ రిపోర్ట్ ప్రకటించింది. ఇందులో చెప్పే సంఖ్యలన్నీ అంచనాలు వేసినవే అయినా అమెరికా ప్రజలు దాదాపుగా నిజమేనని నమ్ముతారు. కేవలం సంగీతం, పాప్ సాంగ్స్ వలనే ఈ సంపదంతా రాలేదు. ఆమె ఎంత చక్కటి సింగరో అంతే సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమన్ కూడా.

ప్రముఖ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న రిహాన్నా 2017లో ‘ఫెంటీ బ్యూటీ’ పేరిట ఓ కంపెనీని ప్రారంభించింది. ఈ కంపెనీలో ఆమెకు 50 శాతం వాటా ఉండగా అదే 1.4 బిలియన్ డాలర్లకు సమానం అంటున్నారు. ఇక మిగతా విలువంతా ‘సావెజ్ ఎక్స్ ఫెంటీ’ అనే లోదుస్తుల బ్రాండ్ వల్ల, రిహానా పాప్ సింగర్ గా సంపాదించే ఆదాయం వల్ల ఏర్పడుతోందట. ఇప్పటికే ఓప్రా విన్ ఫ్రేని ప్రపంచంలోనే రిచ్చెస్ట్ ఎంటర్టైన్మెంట్ విమెన్ కాగా ప్రస్తుతం రిహానా సెకండ్ రిచ్చెస్ట్ ఉమన్ ఎంటర్టైనర్ గా కొనసాగుతోంది. మరి ఇక రిహన్నా నెక్స్ట్ టార్గెట్ ఓప్రానేనేమో!