Samsung Galaxy S22 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S22పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Samsung Galaxy S22 Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్ (Samsung Galaxy S22 Series) ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫోన్ కొనడం సరైనదేనా?

Samsung Galaxy S22 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S22పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Samsung Galaxy S22 gets massive discount on Flipkart, price drops to Rs 50,999

Samsung Galaxy S22 Sale : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి Galaxy S22 సిరీస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్ ధర అమాంతం రూ. 50,999కి పడిపోయింది. 8GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ ధర వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 72,999 ప్రారంభ ధరతో వచ్చింది. శాంసంగ్ యూజర్లు రూ. 22వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇంతకీ, శాంసంగ్ గెలాక్సీ S22 ప్రస్తుతం కొనడం విలువైనదేనా? కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ శాంసంగ్ ఫోన్ డీల్ విలువైనదేనా? :
శాంసంగ్ గెలాక్సీ S22 మోడల్ పాత 5G స్మార్ట్‌ఫోన్.. కానీ, అద్భుతమైన కెమెరా సెటప్ కలిగి ఉంది. సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోరుకునే వినియోగదారులు వెంటనే ఈ గెలాక్సీ S22 5G ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి, భారత్‌లో మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ దాదాపు రూ.51,000కు అందుబాటులో లేదు. అదనంగా, సాఫ్ట్‌వేర్ సపోర్టు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే.. శాంసంగ్ దీర్ఘకాలిక సపోర్టు అందిస్తుంది. ఈ 5G ఫోన్ నాలుగు ఏళ్ల పాటు మెయిన్ (Android OS) అప్‌గ్రేడ్‌లు, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ డివైజ్ Android 14, Android 15, Android 16 OS అప్‌డేట్‌లకు సపోర్టు చేస్తుంది.

Read Also : Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ నుంచి రెండు కొత్త మడతబెట్టే ఫోన్లు.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

శాంసంగ్ గెలాక్సీ S22 ఫీచర్ల పరంగా చూస్తే.. కొత్త గెలాక్సీ S23కి మాదిరిగా ఉంటుంది. ఎవరైనా చాలా తక్కువ ధరకు ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ రెండింటిలో చిప్‌సెట్ ఒక్కటే కొద్దిగా తేడాగా ఉంటుంది. బ్యాటరీలో ఒకేలా ఉంటుంది. స్టీరియో స్పీకర్లు, IP68 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 6.1-అంగుళాల AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలు వంటి మిగిలిన ఫీచర్లు రెండు డివైజ్‌లలో ఒకే విధంగా ఉంటాయి.

Samsung Galaxy S22 gets massive discount on Flipkart, price drops to Rs 50,999

Samsung Galaxy S22 gets massive discount on Flipkart

కొత్త Galaxy S23 స్పీడ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్, హుడ్ కింద కొంచెం భారీ 3,900mAh బ్యాటరీ యూనిట్‌ను అందిస్తుంది. కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కోరుకునే యూజర్లు Galaxy S22 కొనేందుకు ఇష్టపడతారు. కానీ, ఈ ఫోన్‌లో డ్రాబ్యాక్ ఏంటంటే.. చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. గెలాక్సీ S22 బ్యాటరీ లైఫ్ ఎక్కువ రాదని చెప్పవచ్చు. రోజులో మితంగా వాడినా లేదా భారీగా వినియోగించినా కనీసం రోజుకు రెండుసార్లు ఫోన్‌ను ఛార్జ్ చేయవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

మీరు బేసిక్‌లకు (కాలింగ్, టెక్స్టింగ్, సోషల్ నెట్‌వర్కింగ్) కట్టుబడి ఉంటే.. కెమెరా యాప్‌తో పాటు గేమింగ్ యాప్‌లను వాడకపోతే బ్యాటరీ ఎక్కువ సమయం వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S22+ ధర ప్రస్తుతం (Amazon)లో రూ. 62,850కి తగ్గింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 84,999 ప్రారంభ ధరతో వచ్చింది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే.. మెరుగైన బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టుతో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా పరంగా కూడా పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది.

Read Also : Samsung Galaxy M14 5G : శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 13,490 మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!