నూడిల్స్ తిని ’’టేస్ట్ ‘‘ఎలా ఉందో చెబితే చాలు నెలకు రూ.7.34 లక్షల జీతం

  • Published By: nagamani ,Published On : October 17, 2020 / 11:16 AM IST
నూడిల్స్ తిని ’’టేస్ట్ ‘‘ఎలా ఉందో చెబితే చాలు నెలకు రూ.7.34 లక్షల జీతం

Nissin Top Ramen This noodle offer : కష్టపడి పనిచేయటమంటే ఇబ్బంది కానీ మేం వండిపెడతాం..మీరు హాయిగా కూర్చుని రుచి ఎలా ఉందో మాత్రం చెప్పండి మీకు నెలకు లక్షల రూపాయల జీతం ఇస్తామంటే..ఎగిరి గంతేసి మరీ వెళ్లిపోతాం కదూ..అదిగో అటువంటివారి కోసమే ఓ సంస్థ ఉద్యోగాల ప్రకటించింది.

 

కూర్చుని తిని టేస్ట్ ఎలా ఉందో చెబితే చాలా లక్షల రూపాలయ జీతం మీ ఎకౌంట్ లో పడిపోతుందే..ఇంతకీ తిని కూర్చుంటే చాలా అంత జీతం ఇచ్చేస్తారా? ఇదేదో జోక్ అనుకోవద్దు..ఈ కింది వివరాలు చదవితే మీకే తెలుస్తుందిగా..


కష్టపడి పనిచేయక్కర్లేదు..ఊళ్లు పట్టుకుని తిరగక్కర్లేదు..బుర్రలు పగులగొట్టుకుని ఆలోచించక్కర్లేదు. కేవలం వారు వండిపెట్టిన వంటకాల్ని రుచిచూసి ‘‘టేస్ట్’’ఎలా ఉందో చెబితే చాలా జీతం వచ్చేస్తుంది.‘‘కేవలం నాలుకతో రుచి చూసి ఎలా ఉందో చెప్పి కళ్లు చెదిరే జీతాన్ని పొందుతున్నారు చాలామంది.

 

టేస్ట్ చూసి చెప్పేవారు లక్షల్లో సంపాదిస్తున్నారు. సాధారణంగా ఇటువంటి ‘టేస్ట్’’చూసి చెప్పే ఉద్యోగాలు టీ, కాఫీ తయారీ చేసే పరిశ్రమల్లో ఉంటాయి. అటువంటి ఉద్యోగాల్ని ‘‘టేస్ట్ బడ్స్ జాబ్స్’’ అంటారు.


టీ..కాఫీ షాపుల్లోనే కాదు ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఇటువంటి ఉద్యోగాలు ఉంటాయి. నిస్సిన్ సంస్థకు చెందిన టాప్ రామెన్ నూడిల్స్ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ కళ్లు చెదిరే జాబ్ ఆఫర్‌ను ప్రకటించింది.

 

‘‘నూడుల్స్ బ్రాండ్ టాప్ రామెన్ మాతృ సంస్థ నిస్సిన్ ఫుడ్స్ ఈ ఆఫర్ ను ప్రకటించింది. ఈ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది.


ఈ ‘‘టేస్ట్ ’’చూసి చెప్పే ఉద్యోగానికి పెద్దగా చదువు అక్కర్లేదని..తాము తయారు చేసిన నూడిల్స్ రుచి చూసి ఎలా ఉందో చెప్తే చాలు అని స్పష్టంచేసింది.

 

ఈ ఉద్యోగం కోసం అప్లై చేసుకోవాలి అనుకునేవారు టాప్ రామెన్ కంపెనీ నూడిల్స్‌ను వెరైటీగా, సింపుల్‌గా ఉండే విధంగా వండి, దానికి సంబంధించిన లింక్‌కు #HowDoYouTopRamen అనే హ్యాష్‌ట్యాగ్ జతచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని తెలిపింది.


ఆ పోస్ట్‌లో @OriginalTopRamen, @ChefMelissaKing అనే వాటికి ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని వివరించింది. అలాగే టాప్ రామెన్ కంపెనీ ఎందుకు మీకు ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటుందో తెలియజేస్తూ రెండు లైన్లలో రాసి దానిని కంపెనీకి మెయిల్ చేయాలని పేర్కొంది.

 

ఈ టాప్ రామెన్ చీఫ్ నూడిల్ ఆఫీసర్ పదవికి ఎంపికైన ఉద్యోగికి 10వేల డాలర్లు (ఇండియా కరెన్సీలో రూ.7 లక్షల 34 వేలు) జీతంతో పాటు 50 ఏళ్లు టాప్ రామెన్ నూడిల్స్‌ను ఆ ఉద్యోగి ఇంటికి ఉచితంగా పంపనున్నట్టు సంస్థ తెలిపింది.