Vodafone Idea : వోడాఫోన్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. 31 రోజుల వ్యాలిడిటీతో..!

Vodafone Idea : దేశీయ టెలికం దిగ్గజాలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. వోడాఫోన్ ఐడియా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Vodafone Idea : వోడాఫోన్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. 31 రోజుల వ్యాలిడిటీతో..!

Vodafone Idea Introduces Two New Prepaid Plans With 30 Days And 31 Days Validity

Vodafone Idea : దేశీయ టెలికం దిగ్గజాలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ తమ యూజర్ల కోసం 30, 31 రోజుల వ్యాలిడీతో ప్రీపెయిడ్ ప్లాన్లను (రూ.327, రూ.337) ప్రవేశపెట్టాయి. మరో టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియాకు జియో, ఎయిర్ టెల్ బాటలో వచ్చేసింది. వోడాఫోన్ ఐడియా రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30, 31 రోజుల వ్యాలిడిటీతో కనీసం ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ని చేర్చాలని ఇటీవల TRAI టెలికాం ఆపరేటర్‌లను కోరింది. ఈ నేపథ్యంలో టెలికం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో వ్యాలిడిటీని పెంచుతూ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ ప్లాన్‌లను క్యాలెండర్ నెల వ్యాలిడిటీ ప్లాన్‌లు అంటారు. మీరు క్యాలెండర్ నెల ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎంచుకుంటే.. మీ నంబర్‌ను ఒకేసారి రీఛార్జ్ చేసుకోవచ్చు.

వోడాఫోన్ ఐడియా రూ. 327 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 100 SMSలతో పాటు 25GBని అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 100 SMSలను పొందవచ్చు. అంతేకాదు.. ప్రీపెయిడ్ ప్లాన్ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, Vi Movies, టీవీ సబ్‌స్క్రిప్షన్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ ఎక్కువ కాలం వ్యాలిడిటీ వ్యవధిని అందిస్తోంది. రోజువారీ డేటా బెనిఫిట్స్ పొందలేరు. కానీ, సబ్‌స్క్రైబర్‌లు మొత్తం 25GB డేటాను పొందవచ్చు. అది సరిగా ఒక నెలకు సరిపోయేంత డేటా పొందవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువగా డేటాను వినియోగించేవారు అయితే ఇతర ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా అందించే 337 ప్రీపెయిడ్ ప్లాన్ 31 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 100 SMSలతో 28GB వరకు మొత్తం డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. అంతేకాదు.. ప్రీపెయిడ్ ప్లాన్ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, Vi మూవీస్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌కు ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ డేటా బెనిఫిట్స్ అందించదు.

రిలయన్స్ జియో నెల ప్రీపెయిడ్ ప్లాన్ :
రిలయన్స్ జియో ఒక నెల వ్యాలిడిటీతో ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ధర రూ. 259. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. మీరు 64kbps స్పీడ్ ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయవచ్చు. రోజువారీ డేటా బెనిఫిట్స్‌తో పాటు, రిలయన్స్ జియో ప్లాన్ అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. మీరు రోజుకు 100SMS, Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు. ప్లాన్ ఒక నెల వ్యాలిడిటీతో వస్తోంది. ప్రతి నెలాఖరున రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్ నెల ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
జియోతో పాటు, ఎయిర్‌టెల్ కూడా నెల రోజులు మొత్తం ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ కూడా రూ. 296, రూ. 310 ధరతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 296.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 25GB వరకు డేటాను అందిస్తుంది, యూజర్లు MBకి 50 పైసలు ఛార్జ్ అవుతుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోల మొబైల్ ఎడిషన్ 30-రోజుల ఫ్రీ ట్రయల్, 3 నెలల అపోలో 24/7 సర్కిల్‌ను అఫర్ చేస్తోంది.

Read Also : WhatsApp Ban : 14.26 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం..!