Xiaomi Super Saver Sale : అమెజాన్‌లో షావోమీ సూపర్ సేవర్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Xiaomi Super Saver Sale : అమెజాన్ ఇండియాలో షావోమీ సూపర్ సేవర్ సేల్ మొదలైంది.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ జూన్ 14 వరకు కొనసాగుతుంది.

Xiaomi Super Saver Sale : అమెజాన్‌లో షావోమీ సూపర్ సేవర్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Xiaomi Super Saver Sale on Amazon India _ Deals and Discounts on Redmi and Xiaomi Smartphones

Updated On : June 11, 2023 / 5:47 PM IST

Xiaomi Super Saver Sale on Amazon India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) అమెజాన్ ఇండియా (Amazon India)లో సూపర్ సేవర్ సేల్‌ను ప్రారంభించింది. భారత మార్కెట్లో లాంచ్ అయిన వివిధ Redmi, Xiaomi స్మార్ట్‌ఫోన్‌లపై కస్టమర్‌లకు ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్‌లు, ఆఫర్‌లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో కస్టమర్‌లు షావోమీ నుంచి ఇటీవల లాంచ్ చేసిన ఫోన్‌లు, ప్రీమియం డివైజ్‌లపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఈ సేల్ యాక్టివ్‌గా ఉండగా.. జూన్ 14 వరకు అందుబాటులో ఉంటుంది.

అమెజాన్‌లో షియోమీ సూపర్ సేవర్ సేల్ :
షావోమీ సూపర్ సేవర్ సేల్ ప్రస్తుతం (Amazon India)లో కొనసాగుతోంది. కస్టమర్‌ల కోసం అద్భుతమైన డిస్కౌంట్‌లు, మరెన్నో డీల్స్ అందుబాటులో ఉన్నాయి. Redmi A2 లో ఇదే బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఈ సేల్ సమయంలో తక్కువ రూ. 5,999కి అందుబాటులో ఉంటుంది. MediaTek Helio G36 SoC ద్వారా ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ వాస్తవానికి భారత మార్కెట్లో రూ.6,499కి లాంచ్ అయింది.

అదనంగా, Redmi 12C మోడల్ షావోమీ నుంచి మరో బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. ఈ సేల్ సమయంలో రూ. 7,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8,999గా ఉన్న ఫోన్‌లో పొడవైన 6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, Helio G85 SoC, 5000mAh బ్యాటరీ, బ్యాక్ 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉన్నాయి. జూన్ 14న ముగిసే అమెజాన్‌లో షావోమీ సూపర్ సేవర్ సేల్ సమయంలో లభించే ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌లను అసలు మిస్ చేయవద్దు.

Read Also : Apple iPhone 11 Sale : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 11.. కేవలం రూ. 8,950కే సొంతం చేసుకోవచ్చు.. డోంట్ మిస్!

అమెజాన్ సేల్ సమయంలో, భారత మార్కెట్లో షావోమీ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్, (Xiaomi 13 Pro) తగ్గింపు ధర రూ.71,999. వాస్తవానికి ఈ ప్రో ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసాధారణమైన ఫీచర్లను అందిస్తుంది. లైకా-ట్యూన్డ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హై-క్వాలిటీ ఫొటోగ్రఫీని కలిగి ఉంది. ఈ డివైజ్ 2K రిజల్యూషన్‌తో 120Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. షావోమీ 13 ప్రోని స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC అందిస్తుంది. తద్వారా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Xiaomi Super Saver Sale on Amazon India _ Deals and Discounts on Redmi and Xiaomi Smartphones

Xiaomi Super Saver Sale on Amazon India _ Deals and Discounts

2022 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 12 Pro రూ. 42,999 తగ్గింపు ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ పవర్‌ఫుల్ 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. అద్భుతమైన ఫొటోలను తీయడానికి అనుమతిస్తుంది. షావోమీ 12 Pro ఫోన్ Snapdragon 8 Gen 1 SoCపై రన్ అవుతుంది. 4600mAh బ్యాటరీతో దీర్ఘకాలిక యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆశించవచ్చు. ఈ ఫోన్ 120Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ సరికొత్త Android 13 అప్‌డేట్ అందుకుంది.

వాస్తవానికి గత ఏడాదిలో Redmi K50i రూ. 25,999 వద్ద లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్ రూ. 18,999కి అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి ఫోన్ 144Hz IPS LCD డిస్‌ప్లే, MediaTek డైమెన్సిటీ 8100 SoC, బలమైన 5080mAh బ్యాటరీని అందిస్తుంది. అసాధారణమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే గేమర్‌లకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. Redmi Note 12 5G మరో ముఖ్యమైన ఆప్షన్. ఈ ఫోన్ సేల్ సమయంలో రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు.

వాస్తవానికి రూ. 17,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్ 6.7-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 SoC, 48MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ యూజర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ బడ్జెట్ 5G డివైజ్ కోరుకునే యూజర్లు Redmi 11 Prime 5G ధర రూ. 11,999కి అందుబాటులో ఉంది. డైమెన్సిటీ 700 SoC, 50MP డ్యూయల్-కెమెరా సెటప్, ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 90Hz IPS LCDని కలిగి ఉంది.

Read Also : Top 5 Smartphones 2023 : 2023లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవేనట.. గూగుల్ బార్డ్ ఏఐ టక్కున చెప్పేసింది..!