Uttar Pradesh : యూపీలో దారుణం.. క్రికెట్ లో క్లీన్ బౌల్డ్ చేశాడని.. గ్రౌండ్ లోనే బాలుడిని చంపిన మరో బాలుడు

14 ఏళ్ల బాలుడు బౌలింగ్ వేసి 17 ఏళ్ల బాలుడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినా బ్యాటింగ్ చేస్తున్న బాలుడు తాను ఔట్ కాలేదని, పిచ్ ను వదలి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

Uttar Pradesh : యూపీలో దారుణం.. క్రికెట్ లో క్లీన్ బౌల్డ్ చేశాడని.. గ్రౌండ్ లోనే బాలుడిని చంపిన మరో బాలుడు

Boy Killed

Boy Killed : ఉత్తరప్రదేశ్ లో దారుణ జరిగింది. క్రికెట్ ఆట ఒకరి ప్రాణం తీసింది. క్రికెట్ లో క్లీన్ బౌల్డ్ చేశాడని ఓ బాలుడు మరో బాలుడిని గొంతు పిసికి చంపేశాడు. కాన్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరల ప్రకారం… ఘటంపూర్ మండలం రహ్తి డేరాలో బుధవారం ఉదయం పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడారు.

ఈ నేపథ్యంలో 14 ఏళ్ల బాలుడు బౌలింగ్ వేసి 17 ఏళ్ల బాలుడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినా బ్యాటింగ్ చేస్తున్న బాలుడు తాను ఔట్ కాలేదని, పిచ్ ను వదలి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. బ్యాటింగ్ చేస్తున్న బాలుడి సోదరుడు కూడా అతనికి తోడయ్యాడు.

Viral Video : షాకింగ్.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడకం ఎంత డేంజరో చూడండి, వెన్నులో వణుకు పుట్టించే వీడియో

ఇద్దరూ కలిసి బౌలింగ్ చేస్తున్న బాలుడిని తీవ్రంగా కొట్టారు. కింద పడేసి గొంతు పిసికి చంపారు. అనంతరం ఇద్దరు కూడా పరారయ్యారు. మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పోస్టుమార్టానికి అంగీకరించారు.