Lady Doctor Raped by Colleagues : తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం.. వీడియో తీసిన కీచక డాక్టర్లు

క్వారంటైన్ లో ఉన్న మహిళా డాక్టర్లను బెదిరించి అత్యాచారం చేసిన ఇద్దరు డాక్టర్లను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Lady Doctor Raped by Colleagues : తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం.. వీడియో తీసిన కీచక డాక్టర్లు

lady doctors Raped

Updated On : November 20, 2021 / 1:27 PM IST

Lady Doctor Raped by Colleagues :  కోవిడ్ కష్టకాలంలో నిజమైన దేవుళ్లుగా కీర్తించబడిన వారిలో డాక్టర్లు ముందు వరుసలో ఉంటారు. అలాంటి పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉంటూ కోవిడ్ రోగులకు సేవ చేసి క్వారంటైన్ లో ఉన్న మహిళా డాక్టర్లను బెదిరించి అత్యాచారం చేసిన ఇద్దరు డాక్టర్లను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

కోవిడ్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో గతంలోని అన్నాడీఎంకే పభుత్వ హయాంలో, ఈ ఏడాది ఆగస్టులో చెన్నైలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరు మహిళా   వైద్యురాళ్లు తమ కోవిడ్ డ్యూటీ అనంతరం క్వారంటైన్లో ఉండేందుకు టీనగర్ లోని ఒక స్టార్ హోటల్ క్వారంటైన్ సెంటర్ కు వెళ్లారు.

క్వారంటైన్‌లో   ఉన్న రోజుల్లో ఒకరోజు … అదే హోటల్‌లో   క్వారంటైన్‌లో   ఉన్న మరో ఇద్దరు డాక్టర్లులు వెట్రి సెల్వన్(35) మోహన్ రాజ్(28)  అనే ఇద్దరు డాక్టర్లు వీరి గదుల్లోకి ప్రవేశించారు. మహిళా వైద్యురాళ్లను చంపుతామని    బెదిరిస్తూ వారిపై అత్యాచారం చేశారు.   ఆ అరాచకాన్ని వీడియో తీసి పలుమార్లు లైంగిక దాడి జరిపారు.

Also Read : Balakrishna Live : ఖబడ్దార్ వైసీపీ నేతల్లారా! బావ కన్నీళ్లపై బాలయ్య ఫైర్- Live Updates

వేధింపులు తాళలేక మహిళా డాక్టర్లు ఆరోగ్యశాఖమంత్రి,  ప్రిన్సిపల్ కార్యదర్శికి   ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని చెన్నై నగర పోలీసు కమీషనర్‌ను ఆదేశించింది.

తేనాంపేట మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.  కేసు విచారణలో ప్రాధమికంగా నేరం నిర్ధారణ కావటంతో నిందితులు వెట్రి సెల్వన్, మోహన్‌రాజ్‌లను   పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  ఇద్దరినీ శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.