Fire Broke Out Dubai : దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం.. బుర్జ్‌ ఖలీఫా సమీపంలో మంటలు

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్‌ ఖలీఫా సమీపంలోని ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బుర్జ్‌ ఖలీఫాకు అత్యంత సమీపంలో ఉన్న ఎమార్‌ అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగాయి.

Fire Broke Out Dubai : దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం.. బుర్జ్‌ ఖలీఫా సమీపంలో మంటలు

fire broke out

Fire Broke Out Dubai : దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్‌ ఖలీఫా సమీపంలోని ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బుర్జ్‌ ఖలీఫాకు అత్యంత సమీపంలో ఉన్న ఎమార్‌ అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగాయి.

దుబాయ్‌ ప్రభుత్వ ఆధీనంలోని ఎమార్‌ సంస్థ నిర్మించిన 8 బౌలెవార్డ్‌ వాక్‌ టవర్స్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Fire Accdient in Russia: రష్యాలోని కోస్ట్రోమా నగరంలో కేఫ్‌లో అగ్నిప్రమాదం.. 15 మంది మృతి

ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదంపై ఎమార్‌ సంస్థ కానీ, స్థానిక అధికారులు కానీ ఇప్పటిదాకా స్పందించ లేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.