Wedding Ceremony Theft : పెళ్లి వేడుకలో భారీ చోరీ.. రూ.20 లక్షల విలువైన నగలు, డబ్బు ఎత్తుకెళ్లిన మహిళ

జార్ఖండ్ లోని ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ రూ.20 లక్షల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Wedding Ceremony Theft : పెళ్లి వేడుకలో భారీ చోరీ.. రూ.20 లక్షల విలువైన నగలు, డబ్బు ఎత్తుకెళ్లిన మహిళ

Wedding Ceremony Theft

Wedding Ceremony Theft : జార్ఖండ్ లోని ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ రూ.20 లక్షల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. రాంచీలో ఓ కుటుంబం తమ కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్ కు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు.

అతిథులతో ఫంక్షన్ హాల్ నిండిపోయింది. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండటంతో రీఫ్రెష్ అయ్యేందుకు అతిథులు తమ తమ గదుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు నగలు, డబ్బు కనిపించకపోవడంతో షాక్ కు గురయ్యారు.

Karimnagar Robbery : వెంటాడి మరీ రూ.15లక్షలు దోపిడీ.. కరీంనగర్ లో పట్టపగలే భారీ చోరీ

అయితే సీసీపుటేజీ పరిశీలించగా ఓ మహిళ తన దుపట్టాలో నగలు, డబ్బు పెట్టుకుని ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగలు, డబ్బు చోరీ చేసిన మహిళ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.