Manipur : మణిపూర్‌లో వెలుగులోకి మరో దారుణం.. సూపర్ మార్కెట్‌లో గన్‌తో మహిళను

ఆ ఘటన బయటకు వచ్చింది మొదలు మణిపూర్ లో వరుసగా దారుణాలు, ఘోరాలు బయటపడుతూనే ఉన్నాయి. Manipur BSF Jawan

Manipur : మణిపూర్‌లో వెలుగులోకి మరో దారుణం.. సూపర్ మార్కెట్‌లో గన్‌తో మహిళను

Manipur BSF Jawan(Photo : Google)

Manipur BSF Jawan : అల్లర్లు, హింసతో రగిలిపోతున్న మణిపూర్ లో రోజుకో దారుణం వెలుగులోకి వస్తోంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మణిపూర్ లో జరిగిన ఈ ఘోరం యావత్ దేశాన్ని కలవరపడేలా చేసింది. ఆ ఘటన బయటకు వచ్చింది మొదలు మణిపూర్ లో వరుసగా దారుణాలు, ఘోరాలు బయటపడుతూనే ఉన్నాయి.

తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ఓ బీఎస్ఎఫ్ జవాన్ సూపర్ మార్కెట్ లో ఓ మహిళను లైంగికంగా వేధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జూలై 20న ఇంఫాల్ లో ఈ ఘటన జరిగింది. యూనిఫామ్ లో, గన్ పట్టుకుని ఉన్న జవాన్.. మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఆ వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ సతీశ్ ప్రసాద్ గా గుర్తించారు. అతడి చర్యను ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే అతడిని సస్పెండ్ చేశారు. సతీశ్ ప్రసాద్ బీఎస్ఎఫ్ 100 బెటాలియన్ కు చెందిన పోలీస్. భద్రతా విధుల కోసం ఇటీవల అడ్ హక్ యూనిట్ ను మణిపూర్ కు పంపారు. అందులో జవాను సతీశ్ ప్రసాద్ కూడా ఉన్నాడు.

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింస చెలరేగిన నేపథ్యంలో భద్రతా విధుల కోసం తాత్కాలిక యూనిట్‌గా ఆ రాష్ట్రానికి పంపిన ఫోర్స్‌లోని 100 నంబర్ బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్‌పై కోర్టు విచారణ ప్రక్రియ ప్రారంభించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి చర్యలను బీఎస్‌ఎఫ్ అస్సలు సహించదని తేల్చి చెప్పారు. మే 3న మణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుండి 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు.