Boyfriend : యూపీలో బాయ్ ఫ్రెండ్ దారుణం…వివాహితను గర్భవతిని చేసి, ఆపై…

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాయ్ ఫ్రెండ్ దారుణానికి పాల్పడ్డాడు. ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకొని, ఆమెను గర్భవతిని చేసి హతమార్చిన దారుణ ఘటన యూపీలోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది.....

Boyfriend : యూపీలో బాయ్ ఫ్రెండ్ దారుణం…వివాహితను గర్భవతిని చేసి, ఆపై…

married woman

Boyfriend impregnates married woman : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాయ్ ఫ్రెండ్ దారుణానికి పాల్పడ్డాడు. ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకొని, ఆమెను గర్భవతిని చేసి హతమార్చిన దారుణ ఘటన యూపీలోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. (Uttar Pradesh Meerut district) మీరట్ జిల్లాకు చెందిన రాంబిరి అనే మహిళ 2015వ సంవత్సరంలో వినోద్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత రాంబిరి భర్తను వదిలి పుట్టింటికి వచ్చి తండ్రితోనే ఉంటోంది.

Vande Bharat trains : వందేభారత్ రైలు ప్రయాణికులకు శుభవార్త

అంతలో ఆదేశ్ అనే యువకుడితో రాంబిరి అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు ఆదేశ్ వల్ల వివాహిత అయిన రాంబిరి గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని రాంబిరి ఆదేశ్ ను ఒత్తిడి చేసింది. రాంబిరి పెళ్లి చేసుకోవాలని తెచ్చిన ఒత్తిడితో ప్రియుడైన ఆదేశ్ తన స్నేహితులతో కలిసి ప్రియురాలైన వివాహిత రాంబిరిని హత్య మార్చేందుు కుట్ర పన్నాడు. కలుద్దామని చెప్పి రాంబిరిని జులై 2వతేదీన తన ఇంటికి పిలిపించిన ఆదేశ్ తన స్నేహితులతో కలిసి ఇటుకలతో కొట్టి చంపి, మృతదేహాన్ని పొలంలో పడేశాడు. (assaults and kills her using bricks)

Meritorious Students : అసోంలో మెరిట్ విద్యార్థులకు స్కూటర్లు… సీఎం ప్రకటన

రాంబిరిని హత్య చేశారంటూ బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 2న మహిళ రాంబిరి హత్యకు గురైందని, ఒక రోజు తర్వాత ఆమె మృతదేహం పొలంలో లభ్యమైందని పోలీసులు ధృవీకరించారు. మహిళకు, ప్రధాన నిందితుడికి మధ్య సంబంధాలు ఉన్నాయని కూడా పోలీసులు తెలిపారు. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్‌లు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు.ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని మీరట్ పోలీసులు చెప్పారు.