Agra : డబ్బులు డ్రా కాలేదని..ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని స్కాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏటీఎంలో 8 లక్షల 30 వేలు ఉన్నాయన్నారు.

Agra : డబ్బులు డ్రా కాలేదని..ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

Atm Agra

Can’t Withdraw Money ATM : ఏటీఎంకు వెళ్లారు..డబ్బుల కోసం కార్డు అందులో పెట్టారు. కానీ డబ్బులు రావడం లేదు. ట్రై చేశారు. కానీ అదే..ప్రాబ్లమ్. దీంతో చిర్రెత్తుకొచ్చింది. ఏకంగా ఏటీఎం మిషన్ ను కారులో ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సదరు బ్యాంకు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ..గదిలో ఏటీఎం మిషన్ తప్ప..సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని తెలుసుకున్నారు. దీంతో ఎత్తుకెళ్లింది ఎవరు ? ఎటువైపు తీసుకెళ్లారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఆగ్రాలో జరిగిన ఈ ఘటనపై ఎస్ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ వివరాలు వెల్లడించారు. మొదట ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి ప్రయత్నించారని, విఫలం కావడంతో యంత్రాన్ని కారులో తీసుకెళ్లారని తెలిపారు. ఇందులో ఒకరున్నారా ? ఇంకెంతమంది ఉన్నారో తెలియడం లేదన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని స్కాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏటీఎంలో 8 లక్షల 30 వేలు ఉన్నాయన్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సుధీర్ తెలిపారు.