Car Accident : షాకింగ్ వీడియో.. పెళ్లి బృందంపై దూసుకొచ్చి కారు, ఒకరు మృతి, 31మందికి తీవ్ర గాయాలు

పెళ్లి ఊరేగింపు చేస్తున్న గుంపుపైకి అకస్మాత్తుగా స్కార్పియో దూసుకొచ్చింది. బలంగా వారిని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ బ్యాండ్ సభ్యుడు స్పాట్ లోనే చనిపోయాడు. మరో 31మంది తీవ్రంగా గాయపడ్డారు.

Car Accident : షాకింగ్ వీడియో.. పెళ్లి బృందంపై దూసుకొచ్చి కారు, ఒకరు మృతి, 31మందికి తీవ్ర గాయాలు

Car Accident : మన దేశంలో పెళ్లిని ఎంత గ్రాండ్ గా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లింట హంగామా మామూలుగా ఉండదు. సంబరాలు ఓ రేంజ్ లో ఉంటాయి. పెళ్లి వేడుకలతో పాటు పెళ్లి అనంతరం జరిగే ఊరేగింపు కూడా అంతే గ్రాండ్ గా నిర్వహిస్తారు. బంధుమిత్రులు అంతా కలిసి ఊరేగింపులో పాల్గొంటారు.

మ్యూజిక్ కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ పెళ్లి వేడుకలో కూడా ఇలాంటి ఎంజాయ్ మెంట్ కనిపించింది. కానీ, ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంపైకి కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వేగంగా దూసుకొచ్చిన కారు పెళ్లి బృందాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. 31మంది తీవ్రంగా గాయపడ్డారు.(Car Accident)

Also Read..Fight For Paneer : ఏం మనుషులు రా నాయనా.. పెళ్లిలో పనీర్ కోసం కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు

ఈ దారుణం హరిద్వార్ లో జరిగింది. పెళ్లి ఊరేగింపు చేస్తున్న గుంపుపైకి అకస్మాత్తుగా స్కార్పియో దూసుకొచ్చింది. బలంగా వారిని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ బ్యాండ్ సభ్యుడు స్పాట్ లోనే చనిపోయాడు. మరో 31మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఒకరి ప్రాణం పోయింది. అప్పటివరకు ఆనందంగా గడిపిన వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెళ్లింటి చావు డప్పు మోగింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Student Dies Falling : షాకింగ్ వీడియో.. ఫ్రెండ్స్ కళ్ల ముందే చనిపోయాడు, రెప్పపాటులో ఊహించని ఘోరం

బహదరాబాద్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి వరుడి ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది. వరుడి స్నేహితులు, కుటుంబసభ్యులు రోడ్డుపై ఊరేగింపుగా వెళ్తున్నారు. మ్యూజిక్ కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అంతా చాలా ఆనందంగా ఉన్నారు. కొందరు తమ డ్యాన్స్ ని సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. బెల్డా గ్రామం నుండి వివాహ ఊరేగింపు బహదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనోరి రోడ్డులో ఉన్న సర్దార్ ఫామ్ హౌస్‌కు చేరుకుంది. మరోవైపు ఊరేగింపుగా వస్తున్న పెళ్లి బృందానికి స్వాగతం పలికేందుకు వధువు కుటుంబసభ్యులు సన్నాహాలు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇంతలో.. బహదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు పెళ్లి బృందంపైకి దూసుకెళ్లింది. అంతే, ఘోరం జరిగిపోయింది. రోడ్డుపై వెళ్తున్న పెళ్లి బృందాన్ని కారు బలంగా ఢీకొట్టింది. స్పీడ్ గా గుద్ది ముందుకు వెళ్లింది. కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది. ఒకరు చనిపోయారు, 31మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనతో కోపోద్రిక్తులైన పెళ్లి బృందం సభ్యులు.. కారు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. కోపంతో కారుని కూడా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కారుని సీజ్ చేశారు. కాగా, కారు డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది.