MLA Shakeel Car : జూబ్లీహిల్స్‌‌లో ఎమ్మెల్యే కారు బీభత్సం.. యాచకురాలిని ఢీ.. రెండున్నర నెలల చిన్నారి మృతి

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ప్రమాద విషయం తన దృష్టికి వచ్చిందని, ఆ కారుకు..ప్రమాదానికి సంబంధం లేదని స్పష్టం..

MLA Shakeel Car : జూబ్లీహిల్స్‌‌లో ఎమ్మెల్యే కారు బీభత్సం.. యాచకురాలిని ఢీ.. రెండున్నర నెలల చిన్నారి మృతి

Car Accident

Car Crash In Jubilee Hills : జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న మహిళని ఓ కారు అదుపు తప్పి ఢీకొంది. మహిళ చేతిలో నుంచి జారి పడి రెండున్నర నెలల బాబు మృతి చెందాడు. ప్రమాదం తరువాత కారు వదిలి డ్రైవర్ పరారయ్యాడు. కారుకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.

Read More : Afghanistan Girls: వచ్చే వారం నుంచి పాఠశాలలకు వెళ్లనున్న అఫ్గాన్ బాలికలు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ప్రమాద విషయం తన దృష్టికి వచ్చిందని, ఆ కారుకు..ప్రమాదానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లు, తన ఫ్రెండ్ మీర్జాకు స్టిక్కర్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రమాదానికి గురైన కారు మీర్జాకు సంబంధించిందన్నారు. మహిళా యాచకురాలు అకస్మాత్తుగా పరిగెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని, ఆ కారు ఓ ప్రైవేటు ఇన్ఫ్రా కంపెనీ పేరు మీద ఉందని.. ఇది ప్రమాదమా ? నిర్లక్ష్యమా ? అనేది దర్యాప్తు చేయాలన్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. అసలు వాస్తవం ఏంటో తెలుస్తుందన్నారు.