Girlfriend : గర్భం దాల్చిన గర్ల్‌ఫ్రెండ్…డాక్టర్ ప్రియుడు ఏం చేశాడంటే…

గర్ల్ ఫ్రెండ్ గర్భం దాల్చటంతో ప్రియుడైన డాక్టర్ చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. చైనాలోని ఓ వైద్యుడు తన ప్రియురాలికి రహస్యంగా స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసి, అబార్షన్ మాత్రలు ఇచ్చిన ఘటన సంచలనం రేపింది....

Girlfriend : గర్భం దాల్చిన గర్ల్‌ఫ్రెండ్…డాక్టర్ ప్రియుడు ఏం చేశాడంటే…

Girlfriend

Girlfriend : గర్ల్ ఫ్రెండ్ గర్భం దాల్చటంతో ప్రియుడైన డాక్టర్ చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. చైనాలోని ఓ వైద్యుడు తన ప్రియురాలికి రహస్యంగా స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసి, అబార్షన్ మాత్రలు ఇచ్చిన ఘటన సంచలనం రేపింది. చైనా దేశానికి చెందిన వాంగ్ అనే మహిళ యూరాలజిస్ట్ అయిన ప్రియుడితో 2021వ సంవత్సరం నుంచి శృంగార సంబంధంలో ఉంది. పెళ్లి కాకుండానే ఈ ఏడాది మే నెలలో తాను గర్భం దాల్చినట్లు వాంగ్ గుర్తించింది. ఈ విషయాన్ని తన ప్రియుడితో వాంగ్ పంచుకుంది.

Also Read :  Tamil Nadu : బస్సును ఢీకొన్న కారు…ఏడుగురి మృతి

దీంతో తనకు వివాహం వద్దని, పిల్లలు కూడా వద్దని గర్భస్రావం చేయించుకోవాలని ప్రియుడైన డాక్టర్ చెప్పాడు. తాను బిడ్డను ఉంచుకుంటానని ప్రియురాలు చెప్పడంతో ఆగ్రహం చెందిన వైద్యుడు తన ప్రియురాలికి రహస్యంగా గర్భస్రావం చేశాడు. ప్రియురాలు వాంగ్ కోక్ బాటిల్ తీసుకోగా ప్రియుడైన డాక్టర్ కోక్ లో అబార్షన్ మాత్ర కలిపాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాంగ్ డిన్నర్ చేసి అలసిపోయి పడుకుంది.

Also Read : Durga Puja pandal : దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట…ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

ఆమె మేల్కొన్నపుడు మత్తు మందు కలిపిన పానీయాన్ని తాగించి డాక్టర్ ప్రియుడు ప్రియురాలికి అబార్షన్ చేశాడు. తాను రక్తస్రావంతో కదలలేక పోయానని వాంగ్ చెప్పారు. ఈ ఘటనపై ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందించారు. రహస్యంగా అబార్షన్ మాత్రలు ఇచ్చిన డాక్టర్ ప్రియుడు భవిష్యత్ లో ఏం చేస్తాడోనని, ఆయనకు దూరంగా ఉండమని నెటిజన్లు సూచించారు. చైనాలో డాక్టర్ ప్రియుడు వైద్యాన్ని దుర్వినియోగం చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.