Dog saves Owner: కిడ్నాప్ నుంచి యజమానిని రక్షించిన శునకం

యజమానిని కిడ్నాప్ చేసేందుకు వచ్చిన కొందరు దుండగులపై కుక్క దాడి చేసి యజమానిని రక్షించింది. తన విశ్వాసాన్ని కుక్క నిరూపించుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది

Dog saves Owner: కిడ్నాప్ నుంచి యజమానిని రక్షించిన శునకం

Dog

Dog saves Owner: కుక్క మనిషికి మొదటి మిత్రుడు అని అంటుంటారు. ఈ స్టోరీ చూస్తే నిజమే అనిపిస్తుంది. తన యజమానిని కిడ్నాప్ చేసేందుకు వచ్చిన కొందరు దుండగులపై కుక్క దాడి చేసి యజమానిని రక్షించింది. తన విశ్వాసాన్ని కుక్క నిరూపించుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది . ఈ ఘటన మధ్యప్రదేశ్ లోన్ గ్వాలియర్ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్వాలియర్ నగరంలోని అశోక్ నగర్ లో నివాసముంటున్న నితిన్ అనే ఓ వ్యక్తిని కలిసేందుకు కొందరు దుండగులు అతని ఇంటివద్దకు వచ్చారు. మాట్లాడాలి రమ్మంటు నితిన్ ను బయటకు పిలిచారు దుండగులు. ఇంతలో వారందరు కలిసి నితిన్ పై మూకుమ్మడి దాడి చేసి.. అతన్ని కారులో ఎక్కించుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన నితిన్ పెంపుడు కుక్క.. వెంటనే దుండగులపైకి దూకి తీవ్రంగా గాయపరిచింది. కుక్క దెబ్బకు హడలెత్తిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

Also read: Corona Cases: ఏడు నెలల తరువాత 1 లక్షకు చేరిన రోజువారీ కరోనా కేసులు

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నితిన్ ఇంటికి చేరుకొని సమీక్షించారు. దుండగుల నుంచి యజమానిని కాపాడిన కుక్కను పోలీసులు సహా స్థానికులు మెచ్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నితిన్ ను కిడ్నప్ చేసేందుకు యత్నించిన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈఘటన తాలూకు దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డుకాగా, స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ అయింది. కుక్క చేసిన సాహసాన్ని నెటిజన్లు ప్రసంసిస్తున్నారు.

Also read: Corona Medicine: విరివిగా మార్కెట్లో అందుబాటులో కరోనా మెడిసిన్ “మోల్నుపిరవిర్”