Rajasthan : పుట్టింటికి వెళ్తానన్న భార్య..ముక్కు కోసి పడేసిన భర్త

అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త..భార్య ముక్కును కోసి పడేశాడు. పుట్టింటికి వెళుతానని అనడమే ఆమె చేసిన తప్పు.  ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Rajasthan : పుట్టింటికి వెళ్తానన్న భార్య..ముక్కు కోసి పడేసిన భర్త

Crime

Husband Cuts Wife’s Nose : క్షణికావేశంలో ఏం చేస్తారో వారికే తెలియదు. దారుణాలకు తెగబడుతుంటారు. కళ్ల ఎదుటే హత్యలు, అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. తాజాగా.. ఓ భర్త..భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఏడడుగులు నడిచి..కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన ఈ భర్త..భార్య ముక్కును కోసి పడేశాడు. ఆమె ఏం చేసిందో అంటారు కదా ? పుట్టింటికి వెళుతానని అనడమే ఆమె చేసిన తప్పు.  ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Crime News : డబ్బులివ్వలేదని..విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

లునావాస్ గ్రామంలో భూమా రామ్, పూనమ్ దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవలే పూనమ్ దేవి తల్లిదండ్రులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చూసి రావాలని అనుకుంది. ఇదే విషయాన్ని భర్త రామ్ కు చెప్పింది. రేపు..మాపు అంటూ పోస్ట్ పోన్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో..శుక్రవారం మరోసారి తన ప్రతిపాదనను ముందట పెట్టింది. తల్లిదండ్రులను చూసి వెంటనే వస్తానని చెప్పింది. మరోసారి భర్త వద్దని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Read More : AP Crime News : ప్రేమ గుడ్డిది..ఆమెకు 17..అతనికి 42..!

ఈ వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. వెంటనే క్షణికావేశంలో ఉన్న భర్త..వంట గదిలోకి వెళ్లి..చాకును తీసుకొచ్చి పూనమ్ ముక్కను కోశాడు. తీవ్ర రక్తస్రావంతో..బాధ భరించలేక కేకలు పెట్టింది. స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పుట్టింటి వాళ్లకు కూడా ఈ విషయం తెలిసింది. పూనమ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత..పూనమ్ దేవిని తీసుకెళ్లి రాతపూర్వకంగా కంప్లైట్ చేశాడు. అప్పటికే పరారీలో ఉన్న రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.