Constable Cheated Girl : ఎస్.ఐ.కోచింగ్ సెంటర్‌లో స్నేహం…ప్రేమ…. పెళ్లి చేసుకోమని సరికి పరారైన కానిస్టేబుల్

ఎస్సై కోచింగ్ సెంటర్ లో పరిచయం అయిన కానిస్టేబుల్ ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. యువతి గర్భం దాల్చగానే అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమనే సరికి ముఖం చాటేశాడు.

Constable Cheated Girl : ఎస్.ఐ.కోచింగ్ సెంటర్‌లో స్నేహం…ప్రేమ…. పెళ్లి చేసుకోమని సరికి పరారైన కానిస్టేబుల్

Constable Cheateda Girl

Constable Cheated Girl : ఎస్సై కోచింగ్ సెంటర్ లో పరిచయం అయిన కానిస్టేబుల్ ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. యువతి గర్భం దాల్చగానే అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమనే సరికి ముఖం చాటేశాడు.

మహబూబ్‌నగర్‌ జిల్లా గడివేడు మండలానికి చెందిన దాసరి రాములు(29) సైబరాబాద్‌లో కానిస్టేబుల్‌.  రంగారెడ్డి జిల్లా నార్సింగి జాహిర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. 2017లో ఓ యువతి ఎస్‌ఐ కోచింగ్‌ కోసం   హైదరాబాద్‌కు వచ్చింది. అదే సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్న రాములుకు ఆ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో ఆయువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు.

కోచింగ్ కోసం ఇనిస్టిట్యూట్ కు వెళ్లినప్పుడల్లా ఆమెకు మాయమాటలు చెప్పి స్నేహితుడి గదికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక దాడి జరిపాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమెకు అబార్షన్ చేయించాడు. 2020 లో రాములు కానిస్టేబుల్ గా ఎంపికై అక్టోబర్ లో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సైబరాబాద్ లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు.

పెళ్లి చేసుకోమని యువతి కోరటంతో నిరాకరించాడు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని నిన్ను చేసుకోవటం ఇష్టం లేదని తప్పించుకు  తిరగ సాగాడు. దీంతో ఆయువతి ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కానిస్టేబుల్ రాములును సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.