Fire Broke Out : హైదరాబాద్ కింగ్ కోఠిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం, ఏడు కార్లు దగ్ధం

హైదరాబాద్ లోని కింగ్ కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ కారు మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.

Fire Broke Out : హైదరాబాద్ కింగ్ కోఠిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం, ఏడు కార్లు దగ్ధం

Fire broke out

Fire Broke Out : హైదరాబాద్ లోని కింగ్ కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవించాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

వినాయక్ మెకానిక్ షెడ్డులో మంటలు చెలరేగాయి. సెక్యూరిటీ గార్డు నిద్రిస్తున్న కారులో  మంటలు చెలరేగాయి. దీంతో అతను సజీవ దహనం అయ్యారు. పలువురు గాయపడ్డారు. భారీగా చెలరేగిన మంటలతో షెడ్డులోని మూడు కార్లు పూర్తిగా, నాలుగు కార్లు పాక్షికంగా దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

Swapnalok Complex: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. బిల్డింగ్ లోపల చిక్కుకున్న సిబ్బంది

అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరగడంతో భయభ్రాంతులకు గురయ్యారు. కారులో మంటలు చెలరేగడం వల్ల ప్రమాదం సంభవించిందని అబిడ్స్ సిఐ ప్రసాద్ పేర్కొన్నారు.

కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది సమాచారం మేరకు ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశామని తెలిపారు. అక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డ్ సంతోష్ నిద్రిస్తున్న కారులో మంటలు చెలరేగాయని వెల్లడించారు. అతను అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. ప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా, నాలుగు కార్లు పాక్షికంగా దగ్ధం అయ్యాయని చెప్పారు.