Kolkata : స్నేహితురాలి మరణంతో ఆత్మహత్య చేసుకున్న మోడల్..తల్లి షాకింగ్ కామెంట్స్

బెంగాల్ లో 15 రోజుల్లో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవటం కలవర పెడుతోంది. లేటెస్ట్ గా సీరియల్ నటి, మోడల్ బిడిషా మరణ వార్త మరువక ముందే మరోక మోడల్, నటి ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.

Kolkata : స్నేహితురాలి మరణంతో ఆత్మహత్య చేసుకున్న మోడల్..తల్లి షాకింగ్ కామెంట్స్

Manjusha Neogi

Kolkata :  బెంగాల్ లో 15 రోజుల్లో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవటం కలవర పెడుతోంది. లేటెస్ట్ గా సీరియల్ నటి, మోడల్ బిడిషా మరణ వార్త మరువక ముందే మరోక మోడల్, నటి ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.

బిడిషా ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంది. ఆ రిలేషన్ షిప్ బ్రేక్ అప్ అవటంతో తీవ్ర మానసికి ఒత్తిడికి లోనై ఆమె మూడు రోజుల క్రితం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మ హత్య చేసుకున్న రెండు రోజులకు… బిడిషా మరణవార్త తట్టుకోలేని ఆమె స్నేహితురాలు మంజుషా నియోగి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బిడిషా తనతో ఉండదని మనో వేదన చెందే మంజుషా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మంజుషా మృతి పట్ల ఆమె తల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.

బిడిషా అంటే మంజుషా కు ఎంతో ఇష్టం.. ఎప్పడూ ఆమె గురించే చెబుతూ ఉండేది.. బిడిషాతో కలిసి జీవించాలనుకుంటున్నట్లు చాలాసార్లు మంజుషా మాతో చెప్పింది. మేము దాన్ని వ్యతిరేకించి ఎంతో నచ్చ చెప్పాము.  కానీ బిడిషా పై ఉన్న ఇష్టాన్ని మంజుషా వదులుకోలేకపోయిందని ఆమె తల్లి అన్నారు.

15 రోజుల్లో మరణించిన ముగ్గురు నటీమణులు 

పల్లవి డే, బిడిషా మజుందార్, మంజుషా నియోగి

పల్లవి డే, బిడిషా మజుందార్, మంజుషా నియోగి