Man Break Dog Legs : పిల్లాడిపై దాడి చేసిన కుక్క.. కాళ్ల‌ను నరికిన తండ్రి

ఓ పిల్లాడిని వీధికుక్క కురవడంతో కోపోద్రిక్తుడైన అతడి తండ్రి ఇనుపరాడ్డుతో కుక్క కాళ్ళు విరగ్గొట్టారు. అంతటితో ఆగకుండా దాని కాళ్ళను నరికివేశాడు.

Man Break Dog Legs : పిల్లాడిపై దాడి చేసిన కుక్క.. కాళ్ల‌ను నరికిన తండ్రి

Man Break Dog Legs

Man Break Dog Legs : ఓ పిల్లాడిని వీధికుక్క కురవడంతో కోపోద్రిక్తుడైన అతడి తండ్రి ఇనుపరాడ్డుతో కుక్క కాళ్లు విరగ్గొట్టారు. అంతటితో ఆగకుండా దాని కాళ్ల‌ను నరికివేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సీమరియతల్ గ్రామానికి చెందిన సాగర్ విశ్వాస్ కుమారుడు రోడ్డుపై ఆడుకుంటుండగా కుక్క దాడిచేసి గాయపరిచింది. ఆ పిల్లాడితోపాటు మరో ఐదుగురిపై కుక్క దాడి చేసింది. దీంతో కుక్క కరిచిన విషయం పిల్లాడు తన తండ్రి విశ్వాస్‌కి చెప్పాడు.

చదవండి : Street Dogs : దేశంలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయో తెలుసా!

దీంతో కుక్కను వెంబడించి పట్టుకున్న విశ్వాస్ ఇనుపరాడ్డుతో దాడి చేశాడు.. కుక్కకాళ్లను విరగ్గొట్టారు అనంతరం ఓ పదునైన వస్తువుతో దాని కాళ్ల‌ను నరికివేశాడు. దీంతో ఆర్తనాదాలు పెడుతూ ఆ కుక్క మృతి చెందింది. అయితే ఈ ఉదంతాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాడు.. అతడిని గుర్తించి కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపారు.

చదవండి : Dog Hair Dye: కుక్క హెయిర్ డై కోసం రూ.5లక్షలు