Crime news : పోర్న్ వీడియోలు చూసి.. భార్యను హత్యచేసిన భర్త.. అసలేం జరిగిందంటే?

నీలి చిత్రాలకు బానిసైన వ్యక్తి అనుమానంతో భార్యను హత్యచేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ జాహీర్ పాషా, ముబీనాకు 15ఏళ్ల క్రితం...

Crime news : పోర్న్ వీడియోలు చూసి.. భార్యను హత్యచేసిన భర్త.. అసలేం జరిగిందంటే?

Crime News

Crime news : నీలి చిత్రాలకు బానిసైన వ్యక్తి అనుమానంతో భార్యను హత్యచేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ జాహీర్ పాషా, ముబీనాకు 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరు బెంగళూరులోని రాంనగర్‌లో నివాసముంటున్నారు. అయితే జాహీర్ పాషా నిత్యం భార్యపై అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తూ ఇబ్బందిపెట్టేవాడు. జాహీర్ పాషాకు తరచూ నీలి చిత్రాలు చూసే అలవాటు ఉంది. రెండు నెలల క్రితం నీలిచిత్రాలు చూస్తున్న క్రమంలో ఓ చిత్రలో కనిపించింది తన భార్యేనని అనుమానం పెంచుకున్నాడు.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

అప్పటి నుంచి తరచూ వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అనుమానం మరింత పెనుభూతం కావడంతో భార్యను తీవ్రంగా కొట్టడం మొదలు పెట్టాడు. ఫోర్న్ చిత్రంలో నటించింది తనభార్యే అని అనుమానించిన రోజే ఓ ఫంక్షన్ వద్ద భార్య ముబీనాను తీవ్రంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె గత నెల రోజుల క్రితం ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రి నుంచి తిరిగొచ్చిన తరువాత కూడా చిత్రహింసలు పెడుతూనే వచ్చాడు. ఇదే సమయంలో తన తండ్రి గౌస్ పాషా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించగా ముబీనా వద్దని వారించింది.

Nandyala Crime News: ఎలుకల మందు పెట్టి చెల్లెలిని చంపిన అక్క: అసలు విషయం తెలిస్తే షాక్

భార్యపై అనుమానంతో రగిలిపోయిన జాహీర్ పాషా గత ఆదివారం అర్థరాత్రి 12.40 గంటల సమయంలో నిద్రిస్తున్న క్రమంలో భార్యను పిల్లలు చూస్తుండగానే కత్తితో పొడిచి చంపేశాడు. జాహీర్ పాషా పెద్ద కుమారుడు విషయాన్ని ముబీనా తండ్రి గౌస్ పాషాకు తెలియజేయడంతో అతను వచ్చిచూసే సరికి మృతిచెంది ఉంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బైటరాయణపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.