Adipurush: ఆదిపురుష్ సినిమా కాంట్రవర్సీలోకి మహా సీఎంను లాగిన నెటిజెన్.. ఫోన్ నంబర్ షేర్ చేయమంటూ ఝలక్ ఇచ్చిన థానే పోలీస్
ఆదిపురుష్ సినిమా విడుదల అనంతరం ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. కొందరు అదే పాత్రను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో పోలుస్తూ వెకిలిగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొంత మంది నెటిజెన్లు అంటున్నారు.
![Adipurush: ఆదిపురుష్ సినిమా కాంట్రవర్సీలోకి మహా సీఎంను లాగిన నెటిజెన్.. ఫోన్ నంబర్ షేర్ చేయమంటూ ఝలక్ ఇచ్చిన థానే పోలీస్ Adipurush: ఆదిపురుష్ సినిమా కాంట్రవర్సీలోకి మహా సీఎంను లాగిన నెటిజెన్.. ఫోన్ నంబర్ షేర్ చేయమంటూ ఝలక్ ఇచ్చిన థానే పోలీస్](https://10tv.in/wp-content/uploads/2023/06/Untitled-1-128.jpg)
Eknath Shinde: గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఆదిపురుష్’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఒకవైపు అభిమానుల సంబరాలు, మరొక వైపు విమర్శకుల కామెంట్ల నడుమ శుక్రవారం నెట్టింట సందడి చేసింది ఈ సినిమా. అయితే కొంత మంది ఆకతాయిలు పరిధి దాటి వ్యవహరిస్తుంటారు. తమ వ్యతిరేకతను, విమర్శను అదుపు తప్పి వెల్లడిస్తుంటారు. ఆదిపురుష్ సినిమాపై వచ్చిన విమర్శల్లో అలాంటివి అనేకం జరిగాయి. ఒక వ్యక్తి ఇలాగే ఆ సినిమాలోని ఒక పాత్రను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పోల్చారు.
Didn’t know Eknath Shinde was in Adipurush 🤔@mieknathshinde#Adipurush #AdipurushTickets #AdipurushOnJune16 #AdipurushReview #SaifAliKhan pic.twitter.com/saGqpFIhEz
— Abhay 👔 (@xavvierrrrrr) June 16, 2023
Please share your contact no via DM.
— Thane City Police -ठाणे शहर पोलीस (@ThaneCityPolice) June 16, 2023
అయితే అతడికి థానే పోలీసులు గట్టి ఝళకే ఇచ్చారు. ‘నీ కాంటాక్ట్ నంబర్ డీఎం(డైరెక్ట్ మెసేజ్)లో షేర్ చేయ్’ అని థానే పోలీసులు అడిగేసరికి ఆ నెటిజెన్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ‘ఎందుకు సార్, విషయం ఏంటి?’ అంటూ సన్నాయినొక్కు నొక్కాడు. అనంతరం థానే పోలీసులే వారి ఫోన్ నంబర్ షేర్ చేసి, దానికి కాల్ చేయమని అడిగారు. ఆదిపురుష్ సినిమా విడుదల అనంతరం ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. కొందరు అదే పాత్రను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో పోలుస్తూ వెకిలిగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొంత మంది నెటిజెన్లు అంటున్నారు.
Is this Allu Arjun cameo?
— Mehraj Shaikh (@i_m_mehraj) June 16, 2023