Uttar Pradesh: గర్ల్‭ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన అబ్బాయిని కొట్టి చంపిన కుటుంబీకులు

పర్వేజ్‭ను బాలిక తండ్రి గుర్తించాడు, ఆ వెంటనే అతడి మేనల్లుడితో కలిసి ఇనుప రాడ్లతో కొట్టారు. ఇక హత్య అనంతరం.. పర్వేజ్ తమ ఇంట్లోకి చొరబడ్డ దొంగ అని మొదట పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అయితే విచారణలో అసలు విషయం తెలిసిందని వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు.

Uttar Pradesh: గర్ల్‭ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన అబ్బాయిని కొట్టి చంపిన కుటుంబీకులు

Ghaziabad: మైనర్ గర్ల్‭ఫ్రెండ్‭ ఇంటికి వెళ్లిన 23 ఏళ్ల యువకుడిపై ఆమె కుటుంబీకులు దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. ఇద్దరి మతాలు వేరు కావడం వల్లే బాలిక కుటుంబీకులు కోపం వ్యక్తం చేశారని, ఆ కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని శుక్రవారం పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ జిల్లా ఖోడాలో గురువారం జరిగిందీ ఘటన.

Manipur Violence: రాహుల్ గాంధీ ‘మణిపూర్’ పర్యటనపై పొగడ్తలు కురిపించిన బీజేపీ చీఫ్

పర్వేజ్ హత్యకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను (బాలిక తండ్రి, ఆమె ఇద్దరు బంధువులు) పోలీసులు అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు. ఖోడాలో ఉన్న బాలికను చూసేందుకు పర్వేజ్ ఇంటికి వెళ్లాడు. పర్వేజ్‭ను బాలిక తండ్రి గుర్తించాడు, ఆ వెంటనే అతడి మేనల్లుడితో కలిసి ఇనుప రాడ్లతో కొట్టారు. ఇక హత్య అనంతరం.. పర్వేజ్ తమ ఇంట్లోకి చొరబడ్డ దొంగ అని మొదట పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అయితే విచారణలో అసలు విషయం తెలిసిందని వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు.

Heavy Rains: గుజరాత్‭ను ముంచేసిన భారీ వర్షాలు.. ఇప్పటి వరకు 9 మంది మృతి

తీవ్రంగా గాయపడ్డ పర్వేజ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బాలిక, పర్వేజ్‌ల కాల్‌ రికార్డుల ఆధారంగా జరిపిన దర్యాప్తులో వారు చాలా కాలంగా ఒకరికొకరు తెలుసని, నిత్యం ఫోన్‌లో మాట్లాడుకునేవారని తేలింది. అయితే వీరి గురించి తెలుసుకున్న మైనర్ బాలిక కుటుంబ సభ్యులు.. వ్యక్తిని కొట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి, ఆమె బంధువులపై పర్వేజ్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.