Marriage Twist: ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు: శ్రీకాంత్ భార్య లక్ష్మి

రామంతపూర్‌లో ఇటీవల శ్రీకాంత్ అనే యువకుడికి, మరో యువతితో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించిన సంగతి తెలిసిందే. అప్పటికే శ్రీకాంత్‌కు మరో అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ విషయంపై శ్రీకాంత్ భార్య లక్ష్మి స్పందించింది.

Marriage Twist: ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు: శ్రీకాంత్ భార్య లక్ష్మి

Ramantapur

Marriage Twist: రామంతపూర్‌లో ఇటీవల శ్రీకాంత్ అనే యువకుడికి, మరో యువతితో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించిన సంగతి తెలిసిందే. అప్పటికే శ్రీకాంత్‌కు మరో అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ విషయంపై శ్రీకాంత్ భార్య లక్ష్మి స్పందించింది. తను శ్రీకాంత్‌తోనే ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. ‘‘వెంకటరెడ్డి నగర్‌కు చెందిన శ్రీకాంత్ నాతో 12 సంవత్సరాలు సహజీవనం చేశాడు. నా మెడలో పసుపు తాడు కట్టి నాతో కలిసి ఉన్నాడు. పెద్దల సమక్షంలో మే 30న పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. పెళ్లి కోసం పుస్తెలు, మెట్టెలు కొనుక్కోమని రెండు వేల రూపాయలు ఇచ్చాడు.

Cucumber : డయాబెటీస్ ను అదుపులో ఉంచే కీరదోస!

మహబూబ్ నగర్ పెళ్లికి వెళ్లి వచ్చేసరికి శిరీష అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు కాలనీ పెద్దలను, మహిళా సంఘాలను తీసుకుని వెళ్లాను. పెద్దల ముందు నేను కూడా ఇష్టమే అని నాకు తాళి కట్టాడు. తాళి కట్టి నాలుగు రోజులు ఉన్న శ్రీకాంత్‌ను, ఇంట్లో నుంచి వాళ్ల అన్న తీసుకెళ్లాడు. శ్రీకాంత్ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను దళిత మహిళను కావడం వల్లనే ఇలా చేస్తున్నారు. శ్రీకాంత్, శిరీష, నేను.. ముగ్గురం కలిసి ఉండేందుకు కూడా ఒప్పుకున్నాను. శ్రీకాంత్‌తోనే నేను బతుకుతాను. శ్రీకాంత్ ఎక్కడున్నా ఇంటికి రావాలి. నాకు న్యాయం చేయాలి’’ అని లక్ష్మి తెలిపింది.