Bank Robbery : బురఖాలో బ్యాంకుకి వచ్చిన ఇద్దరు.. అసలు విషయం తెలిసి సిబ్బంది షాక్

మహిళలు ధరించే బురఖాలను కూడా దొంగలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. బురఖా ధరించి మహిళల మాదిరి బ్యాంకులోకి వచ్చిన ఇద్దరు దొంగలు దోపిడీకి యత్నించిన షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Bank Robbery : బురఖాలో బ్యాంకుకి వచ్చిన ఇద్దరు.. అసలు విషయం తెలిసి సిబ్బంది షాక్

Bank Robbery : దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లోనే కాదు పట్టపగలు కూడా చోరీలకు తెగబడుతున్నారు. అదను చూసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీ చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. మహిళలు ధరించే బురఖాలను కూడా దొంగలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. బురఖా ధరించి మహిళల మాదిరి బ్యాంకులోకి వచ్చిన ఇద్దరు దొంగలు దోపిడీకి యత్నించిన షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Also Read..Student Dies Falling : షాకింగ్ వీడియో.. ఫ్రెండ్స్ కళ్ల ముందే చనిపోయాడు, రెప్పపాటులో ఊహించని ఘోరం

అది మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలోని ఓ ప్రైవేట్ బ్యాంకు. బ్యాంకు ఓపెన్ లో ఉంది. సిబ్బంది ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఇద్దరూ బురఖాలు ధరించి ఉన్నారు. దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. మహిళలేమో, బ్యాంకు పని మీద వచ్చిన కస్టమర్లు అయి ఉంటారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే.. ఆ ఇద్దరు మహిళలు కాదు పురుషులు. అంతేకాదు దొంగలు. బ్యాంకులో దోపిడీకి వచ్చారని తెలిసి స్టాఫ్ షాక్ అయ్యారు.

Also Read..Fight For Paneer : ఏం మనుషులు రా నాయనా.. పెళ్లిలో పనీర్ కోసం కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు

లోపలికి వచ్చిన దొంగలు సిబ్బందిని గన్ తో బెదిరించారు. డబ్బు ఇవ్వాలని లేదంటే చంపేస్తామన్నారు. ఓ దొంగ బ్యాంకు ఉద్యోగి చేతులు కట్టేసే పనిలో ఉన్నాడు. ఇంతలో అలర్ట్ అయిన బ్యాంకులోని ఇతర సిబ్బంది అలారం మోగించారు. అంతే, భయపడిపోయిన ఓ దొంగ అక్కడి నుంచి పరుగులు తీశాడు. మరో దొంగ కూడా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, బ్యాంకు ఉద్యోగి ఒకరు ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. దొంగ పారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ దొంగను అరెస్ట్ చేశారు. పారిపోయిన మరో దొంగను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బురఖాలో వచ్చిన దొంగలు బ్యాంకులో దోపిడీకి యత్నించడం, బ్యాంకు సిబ్బంది ఓ దొంగను పట్టుకోవడం.. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బురఖాలను ఇలా కూడా వాడుకుంటున్నారా? అని అంతా నివ్వెరపోతున్నారు.

 

బురఖాలో వచ్చి బ్యాంకులో చోరీకి యత్నం..