Telangana : మైనర్ ప్రేమికులు ఆత్మహత్య- ప్రేమజంట వీడియో వైరల్

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు మైనర్లు.. పైగా వేర్వేరు కులాలకు చెందిన వారు... మీకిద్దరికీ  పెళ్ళి చేయటం కుదరదు అన్నారు పెద్దలు.

Telangana : మైనర్ ప్రేమికులు ఆత్మహత్య- ప్రేమజంట వీడియో వైరల్

Lovers Suicide

Telangana : ప్రేమకు వయస్సు అడ్డుకాదు.. అలాగే వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు మైనర్లు.. పైగా వేర్వేరు కులాలకు చెందిన వారు… మీకిద్దరికీ  పెళ్ళి చేయటం కుదరదు అన్నారు పెద్దలు. మనస్తాపానికి గురైన ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లిజిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…. సుల్తానాబాద్ మండలం కనుకులలో శివ,సుస్మిత అనే ఇద్దరు మైనర్లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఈ నోటా. ఆనోటా పాకి ఊరందరికీ తెలిసిపోయింది. దీంతో ఇరు వైపులా కుటుంబ సభ్యులు.. ఇద్దరు ప్రేమికులను మందలించి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇద్దరి కులాలు వేరుకావటం, ఇద్దరు మైనర్లు కావటంతో పెళ్లి చేయలేమని తేల్చి చెప్పారు. పోలీసులు, కుటుంబ సభ్యులు ప్రేమికులిద్దరికీ  కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ   నిన్న కన్నుమూశాడు.  ప్రియుడి మరణ వార్త విని ప్రియురాలు సుస్మిత ఈరోజు తెల్లవారు ఝామున గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కాగా…..మరణించిన ప్రేమికుల ఫోటోలతో ఒక వీడియో తయారు చేసి  గ్రామస్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read : Umesh Gupta: ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా తనయుడి వివాహంలో సెలెబ్రిటీల సందడి