HYD : లైవ్ వీడియోతో మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 06లో ఓ ఫ్లాట్ లో హాసని అనే యువతి...నివాసం ఉంటున్నారు.

HYD : లైవ్ వీడియోతో మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం

Live Suside

Miss Telangana 2018 : ఆమె మాజీ మిస్ తెలంగాణ. ఆత్మహత్య చేసుకుంటున్నా అంట..లైవ్ లో ఓ వీడియో పోస్టు చేయడం కలకలం రేపింది. వెంటనే రెస్పాండ్ అయిన..ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..ఆమె ఇంటికి వెళ్లి..రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమె హైదర్ గూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read More : Hidden Charges: హిడెన్ ఛార్జీల పేరుతో రూ.9వేల 700కోట్ల బ్యాంకు దోపిడీ

వివరాల్లోకి వెళితే…

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 06లో ఓ ఫ్లాట్ లో హాసని అనే యువతి…నివాసం ఉంటున్నారు. ఈమె 2018లో మిస్ తెలంగాణ యువతిగా ఎంపికయ్యారు. కానీ..2021, అక్టోబర్ 28వ తేదీ గురువారం ఉరి వేసుకుంటున్నట్లు ఆన్ లైన్ లో ఓ వీడియో లైవ్ పోస్టు చేశారు. ఈ వీడియోను ఆమె స్నేహితులు చూశారు. వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే నారాయణ గూడ పోలీసులు స్పందించి..ఆమె ఎక్కడ నివాసం ఉంటున్నారో కనుక్కుని అక్కడకు వెళ్లారు.

Read More : ఒక్క ఉపఎన్నిక.. 20 కంపెనీల కేంద్ర బలగాలు.! _ High Security for Huzurabad by Election

ఫ్లాట్ లోకి వెళ్లి హాసిని రక్షించారు. అనంతరం హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాసిని ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే…ఇటీవలే ఓ యువకుడు శారీరంగా వేధిస్తున్నాడంటూ…ఆమె జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు, దీనిపై దర్యాప్త కొనసాగుతోందని తెలుస్తోంది. ఆత్మహత్యకు ఇదే కారణమా ? లేక వేరే కారణమైదైనా ఉందా ? అనేది తెలియరాలేదు.